Heavy Wagering : ఎన్నికల ఫలితాలపై ప్రతి రౌండ్‌కు భారీగా బెట్టింగ్

ఏ పార్టీకి సంబంధం లేని వారు సైతం రాజకీయాలపై ఆసక్తితో పందేలు కాస్తున్నారు

Published By: HashtagU Telugu Desk
betting elections results

betting elections results

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబదించిన లెక్కింపు మొదలైంది. ఫలితాల ఫై యావత్ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఈసారి పోటీ గట్టిగా ఉండడం తో ఎవర్ని విజయం వరిస్తుందో అనేది టెన్షన్ గా మారింది. ఇదిలా ఉంటె రెండు తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగుల హావ నడుస్తుంది. సంక్రాంతి పందేలను మించి..బెట్టింగులు నడుస్తున్నాయి. రాష్ట్రంలో ఫలానా పార్టీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ అభ్యర్థి గెలుస్తాడని అంతర్గతంగా కాయ్ రాజా కాయ్ అంటూ జోరుగా బెట్టింగులు కాస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇందులో పార్టీ నేతలతో పాటు పందెంరాయుళ్లు కూడా ఉంటున్నారు. ఏ పార్టీకి సంబంధం లేని వారు సైతం రాజకీయాలపై ఆసక్తితో పందేలు కాస్తున్నారు. కరీంనగర్, మంథని, సీఎం పోటీ చేస్తున్న గజ్వేల్, కామారెడ్డి, చెన్నూరు,కేటీఆర్ పోటీ చేస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలో పోటీలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులపై బెట్టింగులు జోరుగా కాస్తున్నారు. అంతే కాదు రౌండ్ రౌండ్ కు ఎవరు ఫై చేయి సాధిస్తారు..? ఎవర్ని విజేత అవుతారనేదానిపై కూడా బెట్టింగులు నడుస్తున్నాయి. వందలు , వేలు కాదు లక్షల్లో బెట్టింగ్ లు నడుస్తున్నాయి. అభ్యర్థి గెలుపుతో పాటు రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని అంశాలపై బెట్టింగ్ పర్వం జోరుగా కొనసాగుతోంది. ఎక్కడ ఉత్కంఠ ఉంటుందో అక్కడ పందెం కాసుకుంటున్నారు. చాలా నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీ అభ్యర్థుల మధ్య పోటాపోటీ నెలకొనడంతో బెట్టింగ్ రాయళ్లు తమ జోరు కొనసాగిస్తున్నారు.

Read Also : Rajasthan CM : సీఎం సీటు ఇవ్వకుంటే కాంగ్రెస్‌లోకి వసుంధరా రాజే ?

  Last Updated: 03 Dec 2023, 08:20 AM IST