Site icon HashtagU Telugu

Hyd Traffic : ఐకియా సర్కిల్ వద్ద భారీగా ట్రాఫిక్ జాం…ఆ సైడ్ అస్సలు వెళ్ళకండి

Hyd Traffic

Hyd Traffic

హైదరాబాద్ (Hyderabad) మహానగరంలో ఎన్ని ఫ్లైఓవర్లు కట్టిన ట్రాఫిక్ (Traffic ) మాత్రం కంట్రోల్ కావడం లేదు.రోజు రోజుకు పెరుగుతున్న జనాలతో పాటు అదే స్థాయిలో వాహనాలు పెరిగిపోతున్నాయి. దీంతో ఎక్కడ చూసిన ట్రాఫిక్ జాం ఏర్పడుతుంది. ముఖ్యమంగా వర్షం పడితే ఇక రోడ్ల పైనే..కొన్ని గంటల పాటు ట్రాఫిక్ లో ఉండాల్సిందే. ఈరోజు కూడా అదే జరిగింది. నగరంలో కురిసిన కొద్దీ పాటి వర్షానికే ఎక్కడిక్కడే ట్రాఫిక్ జాం అయ్యింది. ముఖ్యం గా ఐకియా నుంచి బయోడైవర్సిటీకి వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. ఐకియా సర్కిల్ వద్ద చాలా వాహనాలు బారులు తీరాయి. దీంతో వాహనాలు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. అలాగే ఐటీ ఉద్యోగులు దశల వారిగా వెళ్లాలని కోరుతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

గురువారం సాయంత్రం నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. సాయంత్రం కమ్ముకున్న మేఘాలకు తోడు ఉరుములతో పలు ప్రాంతాల్లో వర్షం ప్రారంభయింది. బషీర్ బాగ్, నాంపల్లి, అబిడ్స్​, లిబర్టీ, హిమాయత్ నగర్, నారాయణగూడ, ట్యాంక్​బండ్, పంజాగుట్ట, మేడ్చల్, కండ్లకోయ, కృష్ణాపూర్, దుండిగల్, గండి మైసమ్మ, గచ్చిబౌలి, పాతబస్తీ చార్మినార్ చాంద్రాయణగుట్ట, కోండాపుర్, లింగంపల్లి, బహదూర్పురా, మియాపూర్, ఫలక్ నుమ, బార్కస్, ఉప్పుగూడ, ఎల్బీనగర్, అబ్దుల్లాపూర్​ మేట్, శేరిలింగంపల్లి నియోజకవర్గం పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. కూకట్ పల్లి, కేపీహెచ్​బీ, నిజం పేట్​, బాచుపల్లి, జగద్గిరిగుట్ట, బోరబండలలో వర్షం పడింది. వర్షంతో వాహనదారులు తడిసిముద్దయ్యారు.

Read Also : Tea or Coffee : ఏ వయస్సు తర్వాత పిల్లలకు టీ లేదా కాఫీ ఇవ్వాలి?