Heavy Rains: రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఆదేశాలమేరకు చేపట్టాల్సిన అత్యవసర చర్యలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతి కుమారి ఈ రోజు డా.బి.ఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు అధర్ సిన్హా, రజత్ కుమార్, సునీల్ శర్మ, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, సింగరేణి సిఎండి శ్రీధర్, విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు పాల్గొన్నారు. ఇదే సమావేశంలో అగ్నిమాపక, విపత్తుల నిర్వహణ శాఖ డీజీ నాగిరెడ్డి, జీఎడి కార్యదర్శి శేషాద్రి, సమాచార శాఖ స్పెషల్ కమిషనర్ అశోక్ రెడ్డి, ఈ.ఎన్.సి. గణపతి రెడ్డి లతో పాటు ట్రాన్స్కో, నీటిపారుదల, పంచాయితీ రాజ్, రోడ్లు భవనాల శాఖల ఈ.ఎన్.సీ లు పాల్గొన్నారు.
Also Read: C Ramachandra Reddy : మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత సి. రామచంద్రారెడ్డి కన్నుమూత..