ఫిబ్రవరి , మార్చి , ఏప్రిల్ నెలల్లో ఎండలు దంచికొట్టడం తో మే నెలలో ఏ రేంజ్ లో ఎండలు ఉంటాయో…ఆ ఎండలకు తట్టుకోగలమో లేదో అని తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా భయపడ్డారు కానీ మే నెలలో మాత్రం వాతావరణం మొత్తం మారిపోయింది. గత 10 రోజులుగా రాష్ట్ర వ్యాప్తమగు చిరు జల్లులు పలకరిస్తూ చల్లపరుస్తూ వస్తున్నాయి. ఇక నిన్న గురువారం రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షం పడింది. ఇది ఎండాకాలమా..వాన కాలమా అనే తీరుగా భారీ వర్షం పడడంతో ప్రజలంతా హమ్మయ్య అనుకున్నారు. ఈ వర్షాలు మే 20 వరకు ఉండబోతాయని వాతావరణ శాఖ తెలిపింది.
We’re now on WhatsApp. Click to Join.
రాష్ట్రంలో రాగల ఐదు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈరోజు మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. నిన్న హైదరాబాద్‌లో ఆకాశానికి చిల్లుపడిందా? అన్నట్టు కురిసిన కుండపోత వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించింది. భారీ వర్షానికి నాలాలు పొంగి ప్రవహించాయి.
అలాగే మెదక్, ఆదిలాబాద్ జిల్లాల్లో పిడుగుపాటుతో పలువురు మృత్యువాతపడ్డారు. రైతుల కొనుగోలు కేంద్రం వద్ద ఆరబెట్టిన ధాన్యం తడిచిపోయాయి. అకాల వర్షాల వల్ల రైతులకు తీవ్రం నష్టం వాటిల్లుతుంది. దీంతో చేసేదేమిలేక రైతులు లబోదిబోమంటున్నారు. ఇటీవల కురిసిన భారీ ఈదురు గాలులతో కూడిన వర్షాల వల్ల బొప్పాయి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. వడగండ్లతో కూడిన వర్షాల వల్ల పలు ప్రాంతాల్లో మామిడి పంట తీవ్రంగా దెబ్బతింది. మరో ఐదు రోజుల పాటు వర్షాలు ఉండనున్న క్రమంలో సీఎం రేవంత్ అధికారులను అలర్ట్ చేసారు.
Read Also : Sugar Patients: షుగర్ పేషెంట్లకు ఏ రైస్ మంచిది..? నిపుణులు ఏం చెబుతున్నారు..!
