Heavy rains : గత మూడు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీవర్షాల కారణంగా టీజీఎస్ ఆర్టీసీ తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల బస్సులను రద్దు చేసింది. ఆదివారం రాత్రి వరకు 877, సోమవారం ఉదయం నుంచి 570 కలిపి 1400కు పైగా బస్సులను రద్దు చేసింది.
We’re now on WhatsApp. Click to Join.
ముఖ్యంగా ఖమ్మం, విజయవాడ, మహబూబాబాద్ వైపుగా వెళ్లే రోడ్లన్నీ జలమయం కావడంతో ఆయా మార్గాల్లో బస్సులను పూర్తిగా రద్దు చేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. వరద ఉద్ధృతి తగ్గిన తర్వాత మళ్లీ నడుపుతామని చెప్పారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే బస్సులను గుంటూరు మీదుగా దారి మళ్లించినట్లు పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాకు యథావిధిగా బస్సులను నడుపుతున్నట్లు వివరించారు. వరద ప్రవాహం వల్ల వికారాబాద్‌లో 212 బస్సులకు బదులు 50 మాత్రమే నడుపుతున్నట్లు రంగారెడ్డి ఆర్ఎం శ్రీలత తెలిపారు.
Read Also: Mushroom Benefits : ఆరోగ్యానికి అమృతం..! మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పుట్టగొడుగు..!
మరోవైపు తెలంగాణ, ఏపీలో వానలు, వరదల ప్రభావం రైళ్ల రాకపోకలపై పడింది. భారీ వర్షాలతో ఇప్పటి వరకు 432 రైళ్లు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. దీంతోపాటు 140 రైళ్లు దారి మళ్లించగా, మరో 13 రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు తెలిపింది. రద్దయినవాటిలో సూపర్ ఫాస్ట్, ఎక్స్ప్రెస్, ప్యాసింజర్ రైళ్లు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. కాగా, సోమవారం ఉదయం 96 రైళ్లను రద్దు చేసినట్లు వెల్లడించారు.
కాగా, వరద ప్రాంతాల్లో తక్షణమే సహాయక చర్యలను ముమ్మరం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అధికారులు సెలవులు పెట్టొద్దని చెప్పిన సీఎం, సెలవులు పెట్టిన వారు వెంటనే రద్దు చేసుకొని విధుల్లో నిమగ్నం కావాలని సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణమే సహాయక ఏర్పాట్లు చేపట్టాలని సీఎం ఆదేశించారు. అత్యవసర పనులుంటే తప్ప ప్రజలు బయటకు రావొద్దని పేర్కొన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Read Also: Spirituality: దేవుడు ఫోటోకి పెట్టిన పువ్వులు కింద పడితే దాని అర్థం ఏంటో తెలుసా?