Site icon HashtagU Telugu

Hyderabad : వరదలో కొట్టుకొచ్చిన మృతదేహం

Hyd Rain2

Hyd Rain2

హైదరాబాద్ (Hyderabad) మహానగరాన్ని భారీ వర్షాలు (Heavy rain lashes Hyderabad city) వదలడం లేదు. గత నాల్గు రోజులుగా ప్రతి రోజు భారీ వర్షం పడుతూ నగరాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా సాయంత్రం కాగానే వర్షం పడుతుండడం తో ఆఫీస్ లకు వెళ్లిన వారు..ఇతర పనులు చేసుకొని ఇంటికి వెళ్తున్న వారంతా నరకయాతన అనుభవిస్తున్నారు. నాల్గు రోజులుగా ఇదే పరిస్థితి. ఈరోజు మంగళవారం ఉదయం కూడా నగరవ్యాప్తంగా భారీ వర్షం పడింది. రహదారులపైకి నీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి. కొన్నిచోట్ల కార్లు కొట్టుకుపోయాయి. తెల్లవారుజాము నుంచి కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షం కారణంగా జీహెచ్‌ఎంసీ పరిధిలోని విద్యాసంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే కొన్ని ప్రైవేటు స్కూల్స్ సెలవులు ఇవ్వకపోవడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్కూల్‌కు వచ్చి వెళ్లేటప్పుడు ఏమైనా జరిగితే ఎవరిది బాధ్యతను ప్రశ్నిస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

రాంనగర్‌, పార్సీగుట్ట, బౌద్ధ నగర్‌, గంగపుత్ర కాలనీల్లోకి భారీగా వరదనీరు చేరింది. వరద నీటిలో పార్శిగుట్ట నుంచి రామ్​నగర్ రోడ్డుపైకి ఒక వ్యక్తి మృతదేహం కొట్టుకు వచ్చింది. మృతుడు రామ్‌నగర్‌కు చెందిన అనిల్‌గా గుర్తించారు. కొన్నిచోట్ల కార్లు కొట్టుకుపోయాయి. పంజాగుట్ట కాలనీ సుఖ్​నివాస్ అపార్టుమెంట్‌ షెడ్డుపై పిడుగు పడి కారు ధ్వంసం అయ్యింది. విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం కావడంతో అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించారు. మరోవైపు వాతావరణశాఖ హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. మరో రెండు గంటల పాటు భారీ వర్షం కురిసే అవకాశముందని తెలిపింది.

ఇక బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, ఫిల్మ్‌నగర్‌, పంజాగుట్ట, అమీర్‌పేట, ఎస్‌ఆర్‌నగర్‌, కొంపల్లి, మాదాపూర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, కొత్తపేట, సరూర్‌నగర్‌, ఎల్బీనగర్‌, నాగోల్‌, అల్కాపురి, వనస్థలిపురం, హయత్‌నగర్‌, పెద్ద అంబర్‌పేట, అబ్దుల్లాపూర్‌మెట్‌ భారీ వర్షం కురిసింది. మరోపక్క ఎడతెరిపి లేని వర్షాలకు నిండుకుండలా హుస్సేన్‌సాగర్ మారింది. దీంతో హుస్సేన్‌సాగర్ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసారు. ఈ క్రమంలో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచించారు.

Read Also : Rains Alert : హైదరాబాద్‌‌లో ఇవాళ మధ్యాహ్నం భారీ వర్షం.. ఏపీలో కూడా..