Site icon HashtagU Telugu

Rain Forecast : ఇవాళ 13 జిల్లాలకు.. రేపు 18 జిల్లాలకు వర్ష సూచన

Rain Tax

Thunderstorm and Lightning at Odisha with Full Rains

Rain Forecast : ఇవాళ తెలంగాణలోని 13 జిల్లాలకు వర్షసూచన ఉందని వాతావరణ విభాగం తెలిపింది.  ఈ రోజు జోగులాంబ గద్వాల,  మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట,  కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.  ఇక బుధవారం రోజు మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్‌ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం అంచనా వేసింది. ఈనేపథ్యంలో ఇవాళ, రేపు(మంగళ, బుధవారాల్లో)  ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది.

We’re now on WhatsApp. Click to Join

గురువారం రోజు ఆదిలాబాద్‌, నిర్మల్‌ నిజామాబాద్‌ జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్‌, వరంగల్‌, హనుమకొండ, జనగాం, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్‌, మహబూబాబాద్‌, నాగర్‌ వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్‌, నారాయణపేట జిల్లాల్లో వర్షం(Rain Forecast) కురుస్తుందని వాతావరణ విభాగం పేర్కొంది.

Also Read : Dates Benefits : నానబెట్టిన ఖర్జూరాన్ని తింటే ఎన్ని ప్రయోజనాలో..!

వికారాబాద్‌ జిల్లాలో 3 సెంటీమీటర్ల వర్షం 

ఇక  ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు తెలంగాణ రాష్ట్రంలో వికారాబాద్‌ జిల్లా తాండూరు, పెద్దేముల, దోమ, కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలలో 3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. పలు జిల్లాల్లో తేలికపాటి వానలు పడ్డాయి. రాష్ట్రంలో గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా దిగువన నమోదవడంతో ప్రజలు ఎంతో ఊరటగా ఫీలవుతున్నారు.

Also Read : New Clothes: వారంలో ఈరోజు కొత్త దుస్తులు ధరించకూడదో మీకు తెలుసా?