Kavitha : నేడు ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్‌ పిటిషన్లపై విచారణ

  • Written By:
  • Publish Date - May 24, 2024 / 10:33 AM IST

BRS MLC K Kavitha : బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసు(Delhi liquor scam case)లో జ్యుడీషియల్‌ కస్టడీ(Judicial Custody)లో తీహార్‌ జై(Tihar Jail)లో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో ఈరోజు(శుక్రవారం) ఆమె బెయిల్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు(High Court of Delhi)లో విచారణ జరుగనున్నది.

We’re now on WhatsApp. Click to Join.

కాగా, జస్టిస్ స్వర్ణకాంత శర్మ సింగిల్ జడ్జి బెంచ్ ఈ పిటిషన్లపై విచారణ జరపనుంది. ఈడీ, సీబీఐ కేసుల్లో ట్రయల్ కోర్టు ఇప్పటికే కవిత బెయిల్‌ను తిరస్కరించిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో ట్రయల్‌ కోర్టు ఇచ్చిన తీర్పును కవిత ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశారు.

Read Also: Air India Salary Hike: ఉద్యోగుల‌కు డ‌బుల్ గుడ్ న్యూస్ ప్ర‌క‌టించిన ఎయిరిండియా..!

మే 6న రౌస్ అవెన్యూ కోర్టు కవిత బెయిల్‌ పిటిషన్లను తిరస్కరించింది. ఈడీ, సీబీఐ కేసుల్లో కవిత పాత్ర ఉందని బెయిల్‌ తిరస్కరించింది. ఢిల్లీ మద్యం విధానం ఈడీ కేసులో మార్చి 16వ తేదీన కవిత అరెస్టు అయిన విషయం తెలిసిందే. ఇదే వ్యవహారంలో సీబీఐ కేసులో ఏప్రిల్ 11న కవిత అరెస్టు కాగా.. ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో కవిత తిహాడ్‌ జైలులో ఉన్నారు.