TG High Court : సీఎం రేవంత్‌రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో విచారణ వాయిదా

అదేవిధంగా హైకోర్టులో తాను దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌లో తుది తీర్పు వెలువడే వరకు దిగువ కోర్టు ఎదుట హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఆయన పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం తదుపరి విచారణను జూన్ 12కు వాయిదా వేస్తున్నట్లుగా పేర్కొంది.

Published By: HashtagU Telugu Desk
Hearing on CM Revanth Reddy petition postponed in High Court

Hearing on CM Revanth Reddy petition postponed in High Court

TG High Court : హైకోర్టులో సీఎం రేవంత్‌ రెడ్డి పిటిషన్‌ విచారణ జరిగింది. 2024 లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీపై చేసిన వ్యాఖ్యలపై నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో నమోదైన కేసును కొట్టేయాలని సీఎం క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. రాజకీయ ప్రసంగాలకు పరువు నష్టం ఉండదని అందులో పేర్కొన్నారు. ఈ మేరకు పలు సుప్రీంకోర్టు తీర్పులను రేవంత్‌రెడ్డి పిటిషన్‌లో ప్రస్తావించారు. అదేవిధంగా హైకోర్టులో తాను దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌లో తుది తీర్పు వెలువడే వరకు దిగువ కోర్టు ఎదుట హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఆయన పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం తదుపరి విచారణను జూన్ 12కు వాయిదా వేస్తున్నట్లుగా పేర్కొంది.

Read Also: Medha Patkar : పరువునష్టం కేసు..మేధా పాట్కర్‌ అరెస్టు

కోర్టులో కేసు విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి రేవంత్ రెడ్డికి న్యాయస్థానం మినహాయింపు ఇచ్చింది. సీఎం హోదాలో బిజీగా ఉండే రేవంత్ రెడ్డి ప్రతి వాయిదాకు కోర్టుకు హాజరు కాలేరని హైకోర్టు స్పష్టం చేసింది. బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తొలగిస్తుందని గతంలో సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ చేశారు. సీఎం కామెంట్‌పై ఎక్సైజ్ కోర్టులో విచారణ జరిగింది. క్వాష్ చేయాలంటూ హైకోర్టును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశ్రయించారు. ఈ విచారణ జూన్ 12వ తేదీకు రాష్ట్ర హైకోర్టు వాయిదా వేసింది.

కాగా, రేవంత్‌ రెడ్డి 2024 మే 5న కొత్తగూడెంలో నిర్వహించిన ‘జన జాతర’ సభలో మాట్లాడుతూ నిరాధార ఆరోపణలు చేశారని బీజేపీ పిటిషన్ దాఖలు చేసింది. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే SC, ST రిజర్వేషన్లను ఎత్తివేస్తుందని కామెంట్ చేశారు. ఈ క్రమంలోనే సీఎం చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇక బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో రేవంత్‌ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. అయితే, ఆ ఫిర్యాదులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా రిజర్వేషన్ల తొలగిస్తామని మాట్లాడినట్లుగా ఫేక్ వీడియోను క్రియేట్ చేశారని. అదే వీడియోను సోషల్ మీడియాలోనూ షేర్ చేశారని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే తాజాగా రేవంత్ క్వాష్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం విచారణను వాయిదా వేస్తున్నట్లుగా వెల్లడించింది.

Read Also: Review : సారంగపాణి జాతకం – హాట్ సమ్మర్ లో కూల్ ఎంటర్టైనర్

 

 

  Last Updated: 25 Apr 2025, 12:47 PM IST