తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను కుదిపేసిన ఓటుకు నోటు కేసు (Cash for Vote Case) మరోసారి వార్తల్లోకెక్కింది. ఈ కేసుకు సంబంధించి నాంపల్లి కోర్టు (Nampally Court)లో నేడు (జూన్ 13) విచారణ జరగాల్సి ఉండగా, పలువురు నిందితులకు హాజరు మినహాయింపు లభించింది. కేసులో ప్రధాన నిందితులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, ఉదయ్ సింహా, వేం కృష్ణకీర్తన్‌లు విచారణకు హాజరు కాకుండా మినహాయింపు పొందారు. అయితే సండ్ర వెంకట వీరయ్య, ముత్తయ్యలు మాత్రం కోర్టుకు హాజరయ్యారు.
Meghalaya Honeymoon Case : భర్త హత్యకు ముందు మరో 2 ప్లాన్లు వేసిన ఖిలాడీ
విచారణ వేగవంతం చేయాలని కోర్టును ముత్తయ్య అభ్యర్థించారు. అయితే ఈ కేసుకు సంబంధించిన అంశాలు ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయని, దాని తీర్పు వెలువడే వరకు ప్రస్తుత విచారణ వాయిదా వేయాలని నిందితుల తరఫు న్యాయవాదులు కోర్టును కోరారు. దీనిపై కోర్టు స్పందిస్తూ తదుపరి విచారణ తేదీగా జూలై 25ను నిర్ధారించింది.
ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఓటుకు నోటు వ్యవహారం మరింత చర్చకు తెరలేపింది. ఇప్పటికే ఏడేళ్లుగా నడుస్తున్న ఈ కేసు తుది పరిణామం ఏదీ తేలక, తరచూ వాయిదాలకు గురవుతుండడం ప్రజల్లో ఆసక్తి తో పాటు ఆగ్రహం పెంచుతుంది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న అంశాలపై తేలిన అనంతరం కేసులో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.