దేవగిరి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి వద్ద నుంచి రూ.1.22 కోట్ల అనుమానిత హవాలా నగదును రైల్వే పోలీసులు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) స్వాధీనం చేసుకున్నారు. ముంబై నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఓ ప్రయానికుడి వద్ద నగదు పోలీసులు పట్టుకున్నారు.సాధారణ తనిఖీల్లో భాగంగా అధికారులు అనుమానాస్పదంగా కనిపించిన ప్రయాణికుడిని తనిఖీ చేయగా భారీ మొత్తంలో నగదు బయటపడింది. అయితే ఆ డబ్బుకు సంబంధించిన సరైన పత్రాలు వినియోగంపై స్పష్టమైన వివరాలు అతను ఇవ్వలేకపోయినట్లు అధికారులు తెలిపారు. దర్యాప్తులో భాగంగా ఆ వ్యక్తి ముంబైలోని ఓ నగల వ్యాపారి నుంచి నగదు తీసుకుని సికింద్రాబాద్‌లోని ఒక నగల దుకాణానికి సంబంధించిన వ్యక్తికి అందించాల్సి ఉందని వెల్లడించినట్లు సమాచారం. ఈ నగదు తరలింపుకు తనకు రూ.5,000 ఇవ్వాలని ఒప్పందం కుదిరిందని విచారణలో తెలిపినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి హవాలా కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు
Hawala Cash : దేవగిరి ఎక్స్‌ప్రెస్‌లో భారీ నగదు పట్టివేత.. హవాలా డబ్బుగా పోలీసుల అనుమానాం
దేవగిరి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి వద్ద నుంచి రూ.1.22 కోట్ల అనుమానిత హవాలా నగదును రైల్వే పోలీసులు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) స్వాధీనం చేసుకున్నారు. ముంబై నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఓ ప్రయానికుడి వద్ద నగదు పోలీసులు పట్టుకున్నారు.సాధారణ తనిఖీల్లో భాగంగా అధికారులు అనుమానాస్పదంగా కనిపించిన ప్రయాణికుడిని తనిఖీ చేయగా భారీ మొత్తంలో నగదు బయటపడింది. అయితే ఆ డబ్బుకు సంబంధించిన సరైన పత్రాలు వినియోగంపై స్పష్టమైన వివరాలు అతను ఇవ్వలేకపోయినట్లు అధికారులు తెలిపారు. […]

Hawala Cash
Last Updated: 28 May 2026, 07:57 AM IST