New Ration Card : కొత్త రేషన్‌కార్డుకు అప్లై చేశారా ? కొత్త అప్‌డేట్ ఇదిగో

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో లక్షలాది మంది కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకున్నారు.

  • Written By:
  • Publish Date - June 13, 2024 / 09:00 AM IST

New Ration Card : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో లక్షలాది మంది కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకున్నారు. వారంతా తమ చేతికి కొత్త రేషన్ కార్డు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే చాలా ప్రభుత్వ పథకాల్లో అర్హతకు కొలమానంగా రేషన్ కార్డును పరిగణిస్తున్నారు. ఈనేపథ్యంలో కొత్త రేషన్ కార్డుల వ్యవహారంలో కొంత పురోగతి చోటుచేసుకుంది.

We’re now on WhatsApp. Click to Join

ప్రజల నుంచి వచ్చిన రేషన్ కార్డు దరఖాస్తుల్లో అర్హమైన వాటిని గుర్తించే దిశగా తెలంగాణ సర్కారు కసరత్తు మొదలుపెట్టింది. దరఖాస్తులలోని వివరాలను తనిఖీ చేసే ప్రక్రియ రాష్ట్రంలోని జిల్లాలు, గ్రామాలు, పంచాయతీల్లో శరవేగంగా జరుగుతోంది. ఈ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ అనర్హులకు రేషన్ కార్డులు జారీ చేయబోమని తేల్చి చెప్పింది. రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తుల్లోని వివరాలు నిజమైనవేనా ? కావా ? అనేది తేల్చేందుకు నేరుగా దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి సర్వే చేయాలని రేవంత్ సర్కారు ఆదేశించింది. జిల్లాలు, గ్రామాల్లో అర్హులు ఎవరు  అనేది తేల్చేందుకు మహిళా సంఘాల సేవలను వినియోగించుకోవాలని సూచించింది. మహిళా సంఘాల సభ్యులు రేషన్ కార్డుల దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి.. వారి ఆదాయ, వ్యయాల వివరాలను సేకరిస్తారు. సొంత ఇల్లు, నెల జీతం, సంవత్సరం ఆదాయం, ఆదాయ వనరులు, కుటుంబసభ్యుల సంఖ్య, చేస్తున్న ఉద్యోగాలు వంటి సమాచారాన్ని దరఖాస్తుదారుల నుంచి సేకరిస్తారు. దరఖాస్తులో ప్రస్తావించిన వివరాలు.. వారు చెబుతున్న సమాచారం సరిపోలుతుందా లేదా అనేది చెక్ చేస్తారు. ఈ వేరిఫికేషన్‌లో దరఖాస్తుదారులు పేదలే అని తేలితేనే రేషన్ కార్డు మంజూరవుతుంది. లేదంటే మంజూరు కాదు.

Also Read :Telangana – Chandrababu : తెలంగాణలో టీడీపీకి పునరుజ్జీవం.. చంద్రబాబు నెక్ట్స్ టార్గెట్

రాష్ట్రవ్యాప్తంగా 12,709 గ్రామ పంచాయతీల్లో ఇప్పటికే ఇంటింటి సర్వే మొదలైంది. అయితే అప్లై చేసుకున్న వారిలో చాలా మంది ఉపాధి కోసం గ్రామాలను వదిలి పట్టణాలు, సిటీలకు వలస వెళ్లారు. అలాంటి అర్హులైన పేదలకు ఇంటింటి సర్వే వల్ల నష్టం జరుగుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇంటింటి సర్వేను చేసేవారు.. దరఖాస్తుదారులు ఇంట్లో లేకపోతే ఫోన్ కాల్ చేసి వివరాలను సేకరించాలనే అభ్యర్థన ప్రజల నుంచి వినిపిస్తోంది.