Site icon HashtagU Telugu

Patnam Mahender Reddy Farmhouse : ‘హైడ్రా’ చర్యలు పట్నం కు పనిచేయవా..?

Patnam Mahender Reddy Farmh

Patnam Mahender Reddy Farmh

‘హైడ్రా’ (Hydra) ఈ పేరు ఇప్పుడు నగర వాసుల్లోనే కాదు రాజకీయ నేతల్లో , రియల్ ఎస్టేట్ యజమాన్యుల్లో, సినీ , బిజినెస్ రంగా ప్రముఖుల్లో నిద్ర లేకుండా చేస్తుంది. హైదరాబాద్ (Hyderabad) నగరంలోని చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములను ఆక్రమించిన అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా (Hydra) వ్యవస్థను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో జనాభా పెరిగిపోతుండడంతో ఇష్టాను సారంగా చెరువులు, ప్రభుత్వ భూములు కబ్జా చేసి అక్రమాలు నిర్మాణాలు చేపడుతున్నారు. సరైన పర్యవేక్షణ వ్యవస్థ లేకపోవడంతో ఇన్నాళ్లూ ఆక్రమణదారులు ఆడిందే ఆటగా, పాడిందే పాటగా సాగింది. కానీ ఇప్పుడు హైడ్రా రావడంతో నగర పరిధిలో చర్యలు చేపడుతోంది. హైడ్రా ముందు సీఎం సోదరుడైన , బడా హీరో అయినా, ప్రతిపక్ష పార్టీ కీలక నేతైనా ఇలా ఎవరైనా సరే హైడ్రా ముందు ఒక్కటే అని అంత మాట్లాడుకుంటున్నారు. కానీ మాజీ మంత్రి , ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి దగ్గరకు వచ్చేసరికి హైడ్రా చర్యలు పనిచేయడం లేదా..? అక్రమ నిర్మాణమని తెలియక సామాన్య ప్రజలు ఇల్లు కట్టుకుంటే..ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా వచ్చి కూల్చేసే హైడ్రా అధికారులు..గండిపేట చెరువు పైభాగాన కొత్వాల్‌గూడలో 14.14 ఎకరాల ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్లలో ఉన్న పట్నం మహేందర్ రెడ్డి ఫామ్ హౌస్ (Patnam Mahender Reddy Farmhouse) ను కూల్చే ధైర్యం ఎందుకు చేయడం లేదు..? సామాన్యులకు ఓ న్యాయం..? పట్నం మహేందర్ రెడ్డి కి ఓ న్యాయమా..? ఇదేనా హైడ్రా పని తీరు..? మహేందర్ రెడ్డి ఫామ్ హౌజ్ ను రేవంత్ సర్కారు కూల్చివేస్తుందా? లేదా? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

Patnam4

దీనిపై పట్నం స్పందిస్తూ..కొత్వాల్ గూడలోని సర్వే నెం.13లో తన కుమారుడి పేరుతో 14.14 ఎకరాల పట్టా భూమి ఉందని , ఆ భూమిని 1999లో కొనుగోలు చేశామని, 2005 లో నిబంధనల మేరకే ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా చిన్న కట్టడం కట్టుకున్నామని , అప్పటి ప్రభుత్వం నుంచి, ఇరిగేషన్ శాఖ అనుమతితో ఫాంహౌస్ కట్టుకున్నామని, నిబంధనలకు విరుద్ధంగా కట్టినట్లు తేలితే తానే దగ్గరుండి కూల్చేస్తానని మహేందర్ రెడ్డి చెప్పుకొచ్చారు. తాత, తండ్రుల నుంచి తమది వ్యవసాయ కుటుంబమని, తమ కుటుంబానికి చాలా వ్యవసాయ భూములు ఉన్నాయని చెప్పారు. అలాంటిది ఇంత చిన్న భూమిని కబ్జా చేయాల్సిన అవసరం తనకు లేదన్నారు. అవసరమైతే పట్టా కాగితాలు కూడా ఇస్తానని చెప్పుకొచ్చారు. అది చిన్న గెస్ట్ హౌస్ అని, అది ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ఉందనే ఆరోపణల్లో నిజంలేదని మహేందర్ రెడ్డి చెప్పుకొచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

కానీ పట్నం మహేందర్ చెప్పినదాంట్లో ఏమాత్రం నిజం లేదని పక్కాగా తెలుస్తుంది. మహేందర్ రెడ్డి నిర్మించుకున్న ఫామ్ హౌస్ చెరువుకు అనుకోని ఉంది. చుట్టూ పక్కల ఎలాంటి నిర్మణాలు లేవు.. మనిషే అని వాడు కూడా లేని ప్రాంతం. గోవా లో ఏ మాదిరితే సముద్రం పక్కన కట్టుకుంటారో..ఆ మాదిరి పట్నం..చెరువు పక్కన ఫామ్ హౌస్ కట్టుకున్నారు. ఆ ఫామ్ హౌస్ కు రోడ్ కూడా నిర్మించుకున్నారు. పట్నం మహేందర్ చెపుతున్నట్లు తాను కొనుగోలు చేసింది వ్యవసాయ భూమి అనేదాంట్లో అసలు నిజం లేదు. ఎందుకంటే అదంతా అసైన్డ్ ల్యాండ్స్..అలాంటి అసైన్డ్ ల్యాండ్స్ ను తన కుమారుడి పేరు మీద ఎలా పట్టా చేయించుకుంటారు..? ధరణి లో ఎలా ఎక్కిస్తారు..? ఇదంతా అధికారం చేతిలో ఉందని అప్పట్లో ఇలా చేసి ఉంటాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారం చేతిలో ఉంటె ఏదైనా చేయొచ్చా..? సామాన్యులకు ఓ న్యాయం..? పట్నం మహేందర్ కు ఓ న్యాయమా..? హైడ్రా ముందు అంత సమానమే..సీఎం సోదరుడికి కూడా నోటీసులు ఇచ్చాం అని చెపుతున్నారు..మరి పట్నం ఫామ్ హౌస్ హైడ్రా కు కనిపించడం లేదా..? అనే డిమాండ్ వినిపిస్తుంది.

Patnam3

Patnam2

Patnam1

అంతే కాదు పట్నం నిర్మించుకున్న ఫామ్ హౌస్ పక్క అక్రమ నిర్మాణమని శాటిలైట్ ద్వారా తీసిన గూగుల్ ఎర్త్ చిత్రాలు చెపుతున్నాయి. హిమాయత్ సాగర్ మంచినీటి రిజర్వాయర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ అయిన నిషేధిత జోన్ పరిధిలోని కొత్వాలగూడ గ్రామంలోని సర్వే నంబరు 14 పరిధిలో ప్రహరీగోడలు, రోడ్డు, భవనాలు ఉన్నాయని శాటిలైట్ చిత్రంలో వెలుగుచూశాయి. 2012-16,2017,2018.2019,2021,2023 సంవత్సరాల్లో నేషనల్ రీమోట్ సెన్సింగ్ ఏజెన్సీ తీసిన చిత్రాల్లో ఈ కబ్జాలు కనిపించాయి. ధరణి పోర్టల్ లో శంషాబాద్ మండలం కొత్వాల్ గూడలోని సర్వే నంబరు 14 ఎ, 14 ఎఏ లలో ఉన్న భూములు అసైన్డ్ భూములని ఉంది. అసైన్డ్ భూములను గిఫ్ట్‌ రిజిస్ట్రేషన్లు, విక్రయాలు సాగించారని క్లైమెట్ కాంగ్రెస్ ప్రతినిధి డాక్టర్ లుబ్నా సార్వత్ జరిపిన పరిశోధనల్లో తేలింది. ఈ అసైన్డ్ భూముల్లో 13 ఎకరాలు మాజీ మంత్రి, కాంగ్రెస్ బడా నేత పట్నం మహేందర్ రెడ్డి కుమారుడు పట్నం రినీష్ రెడ్డి పేరు మీద, ఒక ఎకరం రాంబ్లీ భార్య జి కాంతమ్మ పేరిట ధరణి పోర్టల్ లో నమోదైంది. ఇలా పక్క ఆధారాలు ఉన్నప్పటికీ హైడ్రా..ఎందుకు పట్నం ఫామ్ హౌస్ వైపు చూడడం లేదో అర్ధం కావడం లేదు. ఇప్పటికైనా హైడ్రా దూకుడు పెంచి..పట్నం ఫామ్ హౌస్ కూల్చేసి హైడ్రా అందరికి సమానం అని నిరూపించాలని ప్రతిపక్ష పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్నారు.

Read Also : India U19 Squad: భార‌త్ జ‌ట్టును ప్ర‌క‌టించిన బీసీసీఐ.. ఆస్ట్రేలియాతో వ‌న్డే, టెస్టు సిరీస్‌లు..!