Asaduddin Owaisi : మజ్లిస్ పార్టీ అంటే.. తెలంగాణలో హైదరాబాద్ ఓల్డ్ సిటీకి మాత్రమే పరిమితం. కానీ దేశవ్యాప్తంగా ముస్లిం మెజారిటీ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని ఆ పార్టీ వేగంగా కార్యకలాపాలను విస్తరిస్తోంది. ఇతర రాష్ట్రాల్లోనూ ఇప్పుడు మజ్లిస్ పార్టీకి బలమైన క్యాడర్ ఉంది. ప్రస్తుతం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ మజ్లిస్ పార్టీ పోటీ చేస్తోంది. ముస్లింలు అత్యధికంగా ఉన్న అసెంబ్లీ స్థానాల్లో మజ్లిస్ తమ అభ్యర్థులను బరిలోకి దింపింది. 2019 ఎన్నికల్లో మహారాష్ట్రలో 44 స్థానాల్లో మజ్లిస్ పోటీ చేయగా.. ఈసారి కేవలం 16 సీట్లకు పరిమితమైంది. వ్యూహాత్మకంగానే ఈసారి తక్కువ సీట్లలో మజ్లిస్ పోటీ చేస్తోందని తెలిసింది. ప్రస్తుతం మహారాష్ట్ర అసెంబ్లీలో మజ్లిస్‌కు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈసారి పోటీ చేస్తున్న 16 అసెంబ్లీ స్థానాల్లో కనీసం ఐదారు గెల్చుకోవాలనే టార్గెట్‌ను అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi) టీమ్ పెట్టుకుంది.
Also Read :BSNL Direct to Device : బీఎస్ఎన్ఎల్ ‘డైరెక్ట్ టు డివైజ్’ సర్వీసులు షురూ.. ఫైబర్ యూజర్లకు 500 లైవ్‌టీవీ ఛానళ్లు
కాంగ్రెస్ పార్టీ, ఉద్ధవ్ థాక్రే శివసే, శరద్ పవార్ ఎన్‌సీపీలతో కూడిన మహా వికాస్ అఘాడీ కూటమికి చెందిన బలహీన అభ్యర్థులు ఉన్న స్థానాల్లోనే మజ్లిస్ పోటీ చేస్తున్నట్లు సమాచారం. తద్వారా బీజేపీ సారథ్యంలోని మహాయుతి కూటమి తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులకు టఫ్ ఫైట్ ఇచ్చినట్లు అవుతుందని అసదుద్దీన్ భావిస్తున్నారట. అంతేకాదు.. ఈసారి అభ్యర్థుల ఎంపికలోనూ అసదుద్దీన్, అక్బరుద్దీన్ సోదరులు కలిసి పనిచేసినట్లు తెలుస్తోంది. ఆయా అసెంబ్లీ స్థానాల్లో మంచి పేరుండి, స్థానిక సమస్యలపై అవగాహన కలిగి, ప్రజలతో బలమైన సంబంధాలున్న వారికే మజ్లిస్ టికెట్‌ను ఇచ్చారని సమాచారం. ప్రస్తుతం ఒవైసీ సోదరులు మహారాష్ట్రలోనే ఉంటూ తమ పార్టీ అభ్యర్థుల తరఫున సుడిగాలి ప్రచారం చేస్తున్నారు. పలుచోట్ల ఎన్నికల ప్రచార సభల్లో అక్బరుద్దీన్ ఒవైసీ ప్రసంగిస్తూ.. అవసరమైతే ఒవైసీ ఆస్పత్రులు, స్కూళ్లను ఏర్పాటు చేసి అక్కడి ప్రజలకు వైద్య,విద్య సేవలను అందిస్తామని అనౌన్స్ చేశారు. మహిళల సాధికారత కోసం పాటుపడతామని ఆయన చెప్పారు.