Rythu Bandhu : హరీష్ రావు వల్లే రైతు బంధు ఆగిపోయింది – రేవంత్ రెడ్డి

రైతుబంధు నిధుల విడుదలపై నువ్వు ప్రదర్శించిన అత్యుత్సాహం వల్ల.. ఈసీ రైతు బంధు నిధులు విడుదల కాకుండా ఆపేసింది

  • Written By:
  • Updated On - November 27, 2023 / 04:13 PM IST

హరీష్ (Harish Rao) అన్న ఎంత పనిచేసావు పో.. కావాలని చేసావో.. అనుకోకుండా చేసావో కానీ కేసీఆర్ (KCR) కొంప ముంచావు. రైతుబంధు (Rythu Bandhu) నిధుల విడుదలపై నువ్వు ప్రదర్శించిన అత్యుత్సాహం వల్ల.. ఈసీ రైతు బంధు నిధులు విడుదల కాకుండా ఆపేసింది…ఇప్పుడు బిఆర్ఎస్ (BRS) శ్రేణులంతా ఇలా మాట్లాడుకుంటున్నారు. హరీష్ రావు ఎన్నికల ప్రచార సభల్లో ప్రస్తావించడం వల్లే రైతుబంధు విడుదల అనుమతిని వెనక్కి తీసుకున్నట్టు కేంద్ర ఎన్నికల కమిషన్ (EC) తన ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొంది. దాంతో చివరి నిమిషంలో ఓటర్లను ఆకట్టుకోడానికి సీఎం కేసీఆర్ చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. బీఆర్ఎస్ తన కన్ను తానే పొడుచుకున్నట్టు అయ్యింది.

గత రెండుసార్లు సునాయాసంగా విజయం సాధించిన బిఆర్ఎస్..ఈసారి కాంగ్రెస్ నుండి పోటీ ఎదురుకుంటుంది. ప్రజలు పెద్ద ఎత్తున మార్పు రావాలని కోరుకోవడం..యువత సైతం కేసీఆర్ ఫై ఆగ్రహం తో ఉండడం తో ఈసారి బిఆర్ఎస్ గెలుస్తుందో లేదో అనే ఆందోళన ఆ పార్టీ నేతల్లో కూడా ఉంది. అయినా సరే.. కేసీఆర్ మీద పార్టీ శ్రేణుల్లో ఏదో ఒక ఆశ. చివరి నిమిషంలో ఏదో ఒక మాయ చేస్తాడు.. పార్టీని గట్టెక్కిస్తాడు అని కేసీఆర్ మీద బీఆర్ఎస్ కేడర్ గట్టి నమ్మకం పెట్టుకుంది. అందుకు తగ్గట్టుగానే కెసిఆర్ రైతుబంధు డబ్బు రైతుల అకౌంట్లో వేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఆల్మోస్ట్ పర్మిషన్ తెచ్చుకున్నాడు. పోలింగ్ తేదీకి సరిగ్గా రెండు రోజుల ముందు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి 7 వేల కోట్ల రూపాయలు వేసేందుకు ప్రభుత్వం ప్లాన్ చేసింది. అంటే 28వ తేదీ మంగళవారం రోజు రైతుల ఖాతాల్లో జమకు అంతా సిద్ధం చేశారు. అసలు బ్యాంకులకు సెలవులు రాకపోతే.. శనివారం రోజే అమౌంట్ పడేవి. దాంతో ఈసీ పునరాలోచించుకునే అవకాశం కూడా ఉండేది కాదు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక ఈసీ నిర్ణయంతో కాంగ్రెస్ క్యాడర్ కూడా షాక్ అయ్యింది. రైతుల ఖాతాల్లో రైతు బందు డబ్బులు పడితే.. బీఆర్ఎస్ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని భావించారు. దీని మీద కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు కూడా వెళ్లాయి. కానీ ఇదే టైమ్ లో మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ నెత్తిన పాలు పోశారు. ప్రచార సభల్లో రైతుబంధు మీద ప్రకటన చేశారు. సోమవారం సెలవు కాబట్టి.. మంగళవారం కల్లా మీ ఖాతాల్లోకి రైతుబంధు డబ్బులు పడిపోతాయి. మీరు పొద్దుగాల టీ తాగే టైమ్ కి టింగ్ టింగ్ మని మీ మొబైల్ ఫోన్లు మోగుతయ్.. అని గొప్పలు చెప్పుకున్నారు. కాంగ్రెస్ అడ్డుకోవాలని చూసినా.. మేం డబ్బులు ఇస్తున్నామని కామెంట్స్ చేసాడు. సరిగ్గా ఈ కామెంట్స్ తోనే ఇప్పుడు రైతు బంధు నిధులు ఆగిపోయాయి. హరీష్ రావు చేసిన వ్యాఖ్యలను దృష్టి పెట్టుకొని ఈసీ రైతు బంధు నిధుల విడుదల నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది.

ఇదే విషయాన్నీ ఇప్పుడు కాంగ్రెస్ నేతలు చెప్పడం మొదలుపెట్టారు. కేసీఆర్ అల్లుడు హరీష్ రావు నిర్వాకం వల్లే రైతుబంధు ఆగిపోయిందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. డోర్నకల్ లో కాంగ్రెస్ విజయభేరి సభలో పాల్గొన్న ఆయన.. కేసీఆర్ అతి తెలివితేటల వల్ల రైతు బంధు ఆగిపోయిందన్నారు. బీఆర్ఎస్ కుట్రల్ని ప్రజలు గుర్తించాలన్నారు. హరీష్‌రావును చెప్పుతో కొట్టాలని రైతులకు రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేసారు. రైతులతోపాటు రైతు కూలీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఎకరాకు 15 వేలు ఇస్తామని భరోసా ఇచ్చారు. రైతు బంధు ఆగిపోవడానికి కారణమైన కేసీఆర్, హరీష్ రావును ఓడించాలని పిలుపునిచ్చారు.

Read Also : Khammam : ఖమ్మం జిల్లాలో భారీగా పట్టుబడ్డ నోట్ల కట్టలు..కాంగ్రెస్ నేతలవే అని ప్రచారం