Harish rao warns cm revanth over you tube channels: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యూట్యూబ్ ఛానెళ్లను తక్కువ చేసి మాట్లాడటాన్ని ఖండిస్తున్నానని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. యూట్యూబ్ ఛానెళ్లను తక్కువ చేసి మాట్లాడటం విడ్డూరం అంటూ చురకలు అంటించారు. యూట్యూబ్‌ను నమ్ముకొని అధికారంలోకి వచ్చి ఇప్పుడు విమర్శలు చేస్తున్నావని మండిపడ్డారు. ఓడ దాటెదాక ఓడ మల్లన్న.. ఓడ దాటినంక బోడ మల్లన్న అన్న చందంగా రేవంత్ తీరు ఉందని సెటైర్లు పేల్చారు మాజీ మంత్రి హరీష్ రావు. నీ అక్రమాలను, నీ అవినీతిని, నీ డొల్లతనాన్ని, నువ్వు మాట తప్పిన తీరును, ప్రజలకు చేసిన మోసాన్ని యూట్యూబ్ ఛానెళ్ళు ఎండగడుతున్నాయని అక్కసు వెళ్లగక్కుతున్నవు అంటూ ఆగ్రహించారు మాజీ మంత్రి హరీష్ రావు. బిడ్డా.. నిన్ను గద్దె దించడానికి ఈ తెలంగాణ రాష్ట్రంలోని యూట్యూబ్ ఛానెళ్ళు ఒక్కటైతాయని వార్నింగ్ ఇచ్చారు. నీ భండారాన్ని బయట పెడుతాయి జాగ్రత్త అని మాజీ మంత్రి హరీష్ రావు హెచ్చరించారు.
Read Also:Spirituality: మీరు చనిపోయినట్టు కల వస్తే అది దేనికి సంకేతమో తెలుసా?
ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి యూట్యూబ్ ఛానెళ్లపై మాట్లాడుతూ.. విపరీతం ఎట్లైపోయిందంటే.. అసలు కంటే కొసరోళ్లది ఎక్కువైపోయింది. ఎవరు ఏ ట్యూబో తెలుస్తలేదు. ఇలాంటి ట్యూబులోళ్లు ఎక్కడికంటే అక్కడికి వెళ్లిపోయి ఏదిపడితే అది మాట్లాడితే.. అక్కడున్న ప్రజలు ఏమన్నా అంటే.. చూశారా జర్నలిస్ట్ లపై దాడి అంటున్నారు. జర్నలిస్ట్ లు అనే పదానికి డెఫ్నిషన్ ఏంటో మీరు డిసైడ్ చేయండి. మేమెవర్ని జర్నలిస్ట్ లు గా చూడాలో మీరు చెప్పండి. ఎవరికి తోస్తే వాడు ఓ ట్యూబ్ పెట్టుకుని, ఆ ట్యూబ్ లో పెట్టుకుని, మెడలో పట్టీ వేసుకుని, నేను ఓ ట్యూబ్, ఓట్యూబ్ లో జర్నలిస్ట్ ని అని బయలుదేరితే, వారు వ్యవహరించే విధానాన్ని బట్టి ప్రజలు వ్యవహరిస్తారు, ఏది పడితే అది, మధ్యలోనే అడ్డం దొడ్డం మాట్లాడి ఏదైనా ఏమైనా అంటే.. చూశారా జర్నలిస్ట్ ల మీద దాడి అంటారు..” అంటూ యూట్యూబ్ ఛానెళ్లు, ఆ ఛానెళ్లలో ఉండే జర్నలిస్ట్ లపై హాట్ కామెంట్స్ చేశారు.