TG Assembly : అసెంబ్లీలో హరీష్ రావు – కోమటిరెడ్డిల మధ్య మాటల యుద్ధం

ఆకారం పెరిగింది కానీ తెలివి పెరగలేదంటూ హరీష్ రావుపై మంత్రి విరుచుకుపడ్డాడు

Published By: HashtagU Telugu Desk
Harish Kmr

Harish Kmr

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో (Telangana Assembly) భాగంగా శనివారం బడ్జెట్ (Telangana budget 2024) ఫై చర్చ జరిగింది. ఈ చర్చ లో బిఆర్ఎస్ – కాంగ్రెస్ (BRS Vs Congress) పార్టీల నేతల మధ్య వాడి వేడిగా మాటలు నడిచాయి. వందరోజుల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తామని చెప్పి 8 నెలలు కావొస్తున్నా ఇంతవరకు హామీలను అమలు చేయలేదని హరీష్ రావు వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి (MLA Harish Rao Vs Minister Komatireddy Venkat Reddy) ఆగ్రహం వ్యక్తం చేసారు. కేసీఆర్ బడ్జెట్ పై ఏమైనా మాట్లాడుతారని ఎదురు చూసాను..కాంగ్రెస్ పార్టీ ని చీల్చి చెండాడుతా అంటే ఎంత చెండాడతాడో అని చెప్పి ఉదయం 09 గంటలకే అసెంబ్లీకి వస్తే ఆలా చెప్పిన కేసీఆర్ అసలు సభకే రాకుండా హరీష్ రావు ను పంపించాడని కోమటిరెడ్డి సెటైర్ వేశారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై చీల్చి చెండారతారని అనుకుంటే ఏం మాట్లాడకపోవడం ఏమిటని ప్రశ్నించారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ కామెంట్స్ కు గాను కోమటిరెడ్డిని హరీష్ రావు హాఫ్ నాలెడ్జ్ అంటూ విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి రూ.50 కోట్లకు పీసీపీ అధ్యక్ష పదవి కొనుక్కున్నాడని ఆరోజు మీరు అన్నారా లేదా అంటూ కోమటిరెడ్డిని ప్రశ్నించారు. కలెక్టరేట్లు, సచివాలయాలను కేసీఆర్ అద్భుతంగా కటించారని కోమటిరెడ్డి ప్రశంసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ వ్యాఖ్యలకు మంత్రి కోమటి రెడ్డి రివర్స్ కౌంటర్ ఇచ్చారు. ఆకారం పెరిగింది కానీ తెలివి పెరగలేదంటూ హరీష్ రావుపై మంత్రి విరుచుకుపడ్డాడు. మీ మామ.. కేసీఆర్ దళితులకు ముఖ్యమంత్రి పదవి ఇస్తానని చెప్పిండా? లేదా? అని ప్రశ్నించాడు. కేసీఆర్ కేబినేట్‌లో హరీష్ రావు డమ్మీ మంత్రి అంటూ ధ్వజమెత్తారు. డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తామని కట్టించారా? అని దుయ్యబెట్టారు. ఇలా ఇద్దరి మధ్య కాసేపు మాటల యుద్ధం నడిచింది.

Read Also : Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్‌ పోటీలో బీజేపీ ఎమ్మెల్యే, ఆమె ఎవరో తెలుసా?

  Last Updated: 27 Jul 2024, 03:04 PM IST