Site icon HashtagU Telugu

Kavitha Press Meet : హరీష్ రావు …రేవంత్ కాళ్లు పట్టుకొని సరెండర్ అయ్యారు – కవిత

Kavitha Harish Revanth

Kavitha Harish Revanth

తెలంగాణ రాజకీయాల్లో రోజురోజుకు కొత్త మలుపులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యంగా మాజీ మంత్రి హరీశ్ రావుపై ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి హరీశ్ రావు ఢిల్లీ నుంచి ఒకే విమానంలో ప్రయాణించారని, ఆ తర్వాత రేవంత్ కాళ్లు పట్టుకుని సరెండర్ అయిన తర్వాతే తమ కుటుంబంపై కుట్రలు మొదలయ్యాయని కవిత తీవ్రంగా ఆరోపించారు.

Kavitha : కవిత సంచలన వ్యాఖ్యలు..నాపై దుష్ప్రచారం, బీసీల కోసం పోరాడినందుకే సస్పెండ్..!

పార్టీని తన గుప్పిట్లోకి తెచ్చుకోవాలనే ఉద్దేశంతోనే హరీశ్ రావు ఈ కుట్రలకు పాల్పడుతున్నారని కవిత పేర్కొన్నారు. అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్‌ను విచారణల పేరుతో వేధించిన కేంద్ర సంస్థలు, మరి హరీశ్ రావుపై ఎందుకు కేసులు లేవని ఆమె ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయో స్పష్టం చేస్తున్నాయి. కవిత చేసిన ఈ ఆరోపణలు పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.

హరీశ్ రావు, రేవంత్ రెడ్డి మధ్య జరిగినట్లు కవిత ఆరోపించిన ఈ పరిణామం బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కవిత చేసిన ఆరోపణలకు హరీశ్ రావు ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ మొత్తం వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి మార్పులకు దారితీస్తుందో వేచి చూడాలి.