Harish Rao : ఇది ప్రజా పాలనా? ఇది ప్రజా వ్యతిరేక పాలన..!

Harish Rao : హరీష్ రావు తన ట్వీట్‌లో, "చిన్న జీతాలపై ఆధారపడి జీవిస్తున్న హోంగార్డులు, జీతాల జాప్యం కారణంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంటి అద్దెలు, పిల్లల స్కూల్ ఫీజులు, రోజువారీ ఖర్చుల కోసం అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. నెల జీతం లేకుండా వారు దైనందిన జీవితాన్ని కొనసాగించడం ఎంతటి కష్టమో ప్రభుత్వానికి అర్థం కావడం లేదు. బ్యాంకుల ఈఎంఐలు (EMI) చెల్లించకపోవడం వల్ల బ్యాంకు అధికారులు ఫోన్లు చేసి నిలదీస్తున్నారు." అని పేర్కొన్నారు.

Published By: HashtagU Telugu Desk
Harish Letter Cm Revanth

Harish Letter Cm Revanth

Harish Rao : తెలంగాణ రాష్ట్రంలోని వివిధ సమస్యలపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు సోషల్ మీడియా వేదికగా ప్రతిరోజూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా రైతులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఇతర వర్గాలకు సంబంధించిన సమస్యలపై తన ట్విట్టర్ ఖాతా ద్వారా పదేపదే ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు. ఈ క్రమంలోనే, రాష్ట్రవ్యాప్తంగా 16,000కుపైగా హోంగార్డులు 12 రోజులుగా జీతాలు పొందకుండా ఎదుర్కొంటున్న కష్టాలపై ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.

హరీష్ రావు తన ట్వీట్‌లో, “చిన్న జీతాలపై ఆధారపడి జీవిస్తున్న హోంగార్డులు, జీతాల జాప్యం కారణంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంటి అద్దెలు, పిల్లల స్కూల్ ఫీజులు, రోజువారీ ఖర్చుల కోసం అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. నెల జీతం లేకుండా వారు దైనందిన జీవితాన్ని కొనసాగించడం ఎంతటి కష్టమో ప్రభుత్వానికి అర్థం కావడం లేదు. బ్యాంకుల ఈఎంఐలు (EMI) చెల్లించకపోవడం వల్ల బ్యాంకు అధికారులు ఫోన్లు చేసి నిలదీస్తున్నారు.” అని పేర్కొన్నారు.

 ICC Bans Shohely Akhter: బంగ్లాదేశ్ మ‌హిళా క్రికెట‌ర్‌కు ఊహించ‌ని షాక్‌.. ఐదేళ్లపాటు నిషేధం!

“కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇదే తీరును కొనసాగిస్తోంది. ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితో హోంగార్డుల జీవితం దుర్భరంగా మారింది. మాటలు కోటలు దాటితే, చేతలు మాత్రం గడప దాటవు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపై ఏ సమాధానం చెబుతారు? పథకాల్లో కోతలు విధించి, ఉద్యోగులకు వేతనాలు చెల్లించకుండా వారిని దారుణంగా ఇబ్బందులకు గురిచేయడం ప్రజా పాలనా? ఇది ప్రజా వ్యతిరేక పాలన ” అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు.

అలాగే, హోంగార్డులకు వెంటనే జీతాలు చెల్లించాలని, ప్రభుత్వ విధానాన్ని మార్చుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. జీతాల జాప్యం వల్ల వారి కుటుంబాలు తీవ్ర సంక్షోభంలో ఉన్నాయని, తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని గుర్తు చేశారు. ప్రభుత్వ విధానాల పట్ల ఆయన అసహనం వ్యక్తం చేస్తూ, “కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఉద్యోగులు, కార్మికులు, రైతులు, హోంగార్డులు అందరూ ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాలన అంటే వాగ్దానాలు ఇచ్చి ప్రజలను మోసగించడం కాదు, హామీలను నిలబెట్టుకోవడమే అసలైన బాధ్యత” అని వ్యాఖ్యానించారు.

హోంగార్డుల వేతన చెల్లింపుల సమస్యపై ప్రభుత్వం స్పందించకపోతే, దీన్ని పెద్ద ఉద్యమంగా మార్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని హరీష్ రావు స్పష్టం చేశారు. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాల్సిన అవసరం ఉందని, లేదంటే దీనికి గట్టిగా పోరాడాల్సి వస్తుందని హెచ్చరించారు.

 Martin Guptill: లెజెండ్ 90 లీగ్లో మార్టిన్ గుప్టిల్ ఊచకోత, 300 స్ట్రైక్ రేట్‌తో 160 పరుగులు

  Last Updated: 12 Feb 2025, 10:30 AM IST