రైతు రుణమాఫీ (Runamafi ) ఇప్పుడు బిఆర్ఎస్ – కాంగ్రెస్ (BRS vs Congress) మధ్య మాటల తూటాలు పెంచుతుంది. చెప్పినట్లే ఆగస్టు 15 న రెండు లక్షల రుణమాఫీ చేసి మాట నిలుపుకున్నామని..ఇక హరీష్ రావు సవాల్ చేసినట్లు రాజీనామా చేయాలనీ కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది. అయితే బిఆర్ఎస్ మాత్రం పూర్తిస్థాయి లో రుణమాఫీ చేయకుండా కేవలం 25 % మందికి మాత్రమే రుణమాఫీ చేసి..అందరికి చేశామని ప్రకటనలు చేస్తున్నారని బిఆర్ఎస్ ఆరోపిస్తుంది.
We’re now on WhatsApp. Click to Join.
ఈ క్రమంలో హరీష్ రావు (Harish Rao) ..సీఎం రేవంత్ (CM Revanth) కు సవాల్ విసిరారు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో ఏ ప్రాంతానికైనా తాము రావడానికి సిద్ధమని రుణమాఫీ సంపూర్ణంగా అయిందని రైతులు చెబితే దేనికైనా సిద్ధమన్నారు. కొన్ని ప్రాంతాల్లో వేలల్లో రుణగ్రహీతలు ఉంటే వందల మందికే రుణమాఫీ అయిందని చూపించారు. తన నియోజకవర్గంలోనే చాలా పల్లెలు ఇలాంటివి ఉన్నాయన్నారు. తెలంగాణ భవన్‌లో కాల్ సెంటర్ పెడితే తమకు లక్షమందికిపైగా తమకు రుణమాఫీ కాలేదని రైతులు ఫోన్లు చేసి చెప్పారన్నారు. 22 లక్షల మందికే రుణమాఫీ చేశారని అన్నారు. రుణమాఫీ చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ అంటూ ఊదరగొట్టిన ప్రభుత్వం 14 వేల కోట్లు కోత పెట్టిందని ఆరోపించారు. 25 లక్షల మందికి రుణమాఫీ చేయకుండా ఎగ్గొట్టారని ధ్వజమెత్తారు.
రుణమాఫీ చేయలేక చేతులెత్తేసినందుకు రేవంత్ రెడ్డి భేషరతుగా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. చోర్ ఉల్టా కొత్వాల్‌కే డాంటే అన్నట్టుగా తానే రాజీనామా చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారని విమర్శించారు. రుణమాఫీలో కోత.. మాటలేమో రోత అన్నట్టుగా రేవంత్ రెడ్డి వైఖరి ఉందన్నారు. బూతులు తిడితే రైతు రుణమాఫీ పూర్తవుతుందా? అని ప్రశ్నించారు. రంకెలు వేస్తే అంకెలు మారిపోవని, అబద్ధాలు నిజమైపోవని తెలిపారు. నీ తిట్లతో రైతుల ఖాతాలో కోట్ల రూపాయలు పడవని స్పష్టం చేశారు.
Read Also : Revanth Reddy : అతి త్వరలో రేవంత్ తన టీం తో కలిసి బీజేపీలో చేరబోతున్నారు – కేటీఆర్