Site icon HashtagU Telugu

Harish Rao: ఆటో డ్రైవర్ల సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం!

Harish Rao Rythubandhu

Harish Rao Rythubandhu

Harish Rao: సిద్దపేట్ పట్టణంలో ‘సిద్దిపేట జిల్లా ఆటో క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ’ ఆధ్వరంలో ఆటల పొటీ కార్యక్రమాన్ని  మాజీ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘సిద్దిపేట జిల్లా ఆటో క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో అటల పోటీలు నిర్వహించడం రాష్ట్రానికి ఆదర్శం. 1480 మంది ఆటో డ్రైవర్లు ఈ సొసైటీలో సభ్యులుగా ఉన్నారు. ఆటో డ్రైవర్లు సిద్దిపేటకు బ్రాండ్అంబాసిడర్లు. పట్టణానికి వచ్చే అతిథులను గౌరవమర్యాదలతో గమ్యాలకు చేరుస్తున్నారు’’ అని హరీశ్ రావు అన్నారు.

‘‘కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్ల జీవితాలను రోడ్డున పడేసింది. ప్రభుత్వం ఆటో డ్రైవర్లు కు నెలకు రూ. 15 వేల జీవన భృతి ఇవ్వాలి. ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోయారు. రాష్ట్రంలోని 6 లక్షల మంది డ్రైవర్లను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి. ఒకరికి మంచి చేయడానికి ఇంకొకరి కడుపు కొట్టాల్సిన అవసరం లేదు. ఆటో కార్మికులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం. వారి సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తి పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం’’ అని హరీశ్ రావు అన్నారు.

ఇప్పటికే ఆటో డ్రైవర్లు ఆందోళన బాట పట్టారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఉచిత బస్సు ప్రయాణ పథకంతో తమ ఉపాధి దెబ్బతిన్నదంటూ రోడ్డెక్కారు. వేలాదిమంది తమ ఆటోలతో ర్యాలీ తీశారు. ఫైనాన్స్‌లో కొన్న ఆటోలకు నెలనెలా ఈఎంఐ కట్టలేని దుస్థితి వచ్చిందని ఆవేదన చెందారు. తమకు ఉపాధి కల్పించి ఆదుకోవాలంటూ కలెక్టర్లకు వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వం తమకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపాలని, ప్రతినెల జీవన భృతి 10వేలు, ప్రతి ఆటో డ్రైవర్‌కు జీవిత బీమా 5లక్షల పాలసీ సౌకర్యం కల్పించాలని కోరారు. సర్కారు స్పందించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Also Read: Chennamaneni Ramesh : చెన్నమనేని రమేశ్ పాస్‌పోర్టు‌పై కేంద్రం కీలక నివేదిక