బిఆర్ఎస్ మాజీ మంత్రి , సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు..పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి తెలియజేసారు. మాజీ సీఎం కేసీఆర్ ప్రమాదానికి గురై..సోమాజిగూడ యశోద హాస్పటల్ లో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ విషయం తెలిసి..పెద్ద ఎత్తున పార్టీ నేతలు , అభిమానులు హాస్పటల్ కు వస్తూ..కేసీఆర్ ఆరోగ్యం ఫై అరా తీస్తున్నారు. ఈ క్రమంలో హరీష్ రావు కేసీఆర్ (KCR)ను పరామర్శించేందుకు ఎవరూ హాస్పిటల్ రావొద్దని అభిమానులకు(Fans) విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని అభిమానులు ఆందోళన చెందవద్దన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
కేసీఆర్‌ను పరీక్షించిన వైద్యులు తుంటి ఎముక విరిగినట్లు గుర్తించారు. ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కేసీఆర్ ఇవాళ సాయంత్రం తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేయించుకోనున్నారు. కేసీఆర్ కోలుకోవడానికి ఆరు నుంచి ఎనిమిది వారాలు పడుతుందని హరీశ్ రావు అన్నారు. సర్జరీ సమయంలో ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ఎవ్వరూ ఆస్పత్రికి రావద్దని కోరుతున్నానని తెలిపారు. కేసీఆర్ కు విశ్రాంతి అవసరమన్నారు.
Read Also : CM Revanth Reddy : ముగిసిన విద్యుత్, ఆర్టీసీపై సీఎం రేవంత్ సమీక్ష