Harish Rao : మాజీ మంత్రి హరీష్ రావు గుమ్మడిదల డంప్‌యార్డ్ ఏర్పాటుపై తీవ్రంగా స్పందించారు. గుమ్మడిదలను మరో లగచర్ల చేయకూడదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గుమ్మడిదలలో జీహెచ్ఎంసీ డంప్‌యార్డ్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ జరుగుతున్న స్థానికుల ఆందోళనకు ఆయన మద్దతు తెలిపారు. ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న హరీష్ రావు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మండి పడ్డారు.
“డంపింగ్ యార్డు వల్ల పర్యావరణం దెబ్బతింటుంది, నర్సాపూర్ చెరువు కలుషితం అవుతుంది. ప్రజల ఆరోగ్యాలు ప్రమాదంలో పడతాయి. అయినా కాంగ్రెస్ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోంది,” అని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ప్రజల కోరిక మేరకు ఈ ప్రాజెక్టును ఆపినప్పటికీ, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పునరుద్ధరించిందని విమర్శించారు.
Phone-Tapping Case : ప్రణీత్ రావుకు బెయిల్
రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఉద్దేశించి, “ఇది ఎమర్జెన్సీ పాలనలాగా మారింది. వందల మంది రైతులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. రాత్రికి రాత్రి పనులు సాగించి డంపింగ్ యార్డు ఏర్పాటు చేయాలని కుట్ర చేస్తున్నారు,” అని ధ్వజమెత్తారు. గుమ్మడిదల రైతులు పచ్చటి పంటలు పండించే వారు అని, వారి భూములు నాశనం చేయడం సరికాదని హరీష్ రావు హెచ్చరించారు.
రేవంత్ రెడ్డి పాలనపై విరుచుకుపడుతూ, “ఇందిరమ్మ రాజ్యం అన్న వాళ్లు, ఎమర్జెన్సీ పాలనను అమలు చేస్తున్నారు. ఊళ్లలో పోలీసుల మోహరింపు ప్రజలను భయపెడుతోంది. రుణమాఫీ, రైతుబందు, మహాలక్ష్మి వంటి వాగ్దానాలు ఎక్కడి మోసమయ్యాయి,” అని ప్రశ్నించారు. డంపింగ్ యార్డు ప్రతిపాదనను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ, “అసెంబ్లీలో గుమ్మడిదల ప్రజల తరపున గళం విప్పుతాను. ఎయిర్ ఫోర్స్ అధికారులు కూడా ఇక్కడ డంపింగ్ యార్డు వద్దని సూచించారు. అయినా ప్రభుత్వపు మొండి వైఖరి కొనసాగుతోంది,” అని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు.
సంగారెడ్డి కలెక్టర్, జీహెచ్ఎంసీ కమిషనర్లను ఉద్దేశించి, “రెండు సార్లు హైకోర్టు ఆదేశాలు వచ్చినా ఎందుకు లెక్కచేయడం లేదు? హైకోర్టు ఆదేశాల మేరకు పనులను వెంటనే ఆపాలి. టిప్పర్లు, పోలీసులను వెనక్కి పంపించాలి,” అని హెచ్చరించారు. ప్రభుత్వానికి ప్రజా శక్తిని తక్కువ అంచనా వేయొద్దని, లేని పరిస్థితుల్లో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం తప్పదని హరీష్ రావు స్పష్టం చేశారు.
Bomb Blast In Pakistan: పాకిస్థాన్‌లో భారీ పేలుడు.. 11 మంది కార్మికులు మృతి?