కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) రాష్ట్రంలోని ఎవ్వరికి మేలు చేయడం లేదని ఆరోపిస్తూ వస్తున్న బిఆర్ఎస్ (BRS)…తాజాగా ప్రభుత్వ స్కూల్స్ (Govt Schools) లలో అందించే మధ్యాహ్న భోజనం విషయంలో సర్కార్ ఫై తీవ్రస్థాయి లో ఆగ్రహం వ్యక్తం చేసింది. బడీడు పిల్లలకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశ్యంతో కేసీఆర్ సర్కార్ మధ్యాహ్న భోజన పథకాన్ని తీసుకొస్తే..ఈ రేవంత్ సర్కార్ ఆ పథకాన్ని కూడా సరిగా అందించలేకపోతుందని మండిపడ్డారు హరీష్ రావు. పౌష్టికాహారంతో కూడిన భోజనాన్ని అందించాల్సిన ప్రభుత్వం..కారం నూనె మెతుకులు పెడుతుందని అన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో ఈ ఘటన చోటు వెలుగులోకి వచ్చింది. కూరగాయల ధరల పెరుగుదల.. మరో వైపు మధ్యాహ్న భోజనానికి సంబంధించిన బిల్లులు రాకపోవడంతో కుక్ కమ్ హెల్పర్లు ఇలాంటి భోజనం పెడుతున్నారు హరీశ్‌రావు పేర్కొన్నారు. ప్రభుత్వం భావిభారత పౌరులతో ఇంత బాధ్యతారహితంగా వ్యవహరించడం బాధాకరమన్నారు. విద్యార్థులకు పౌష్టికాహారం కోసం అందించే సిఎం బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని అటకెక్కించిన ప్రభుత్వం.. ఇప్పుడు మధ్యాహ్న భోజనం అందించడంలో తీవ్రంగా విఫలమైందని మండిపడ్డారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమని.. మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి భోజన సామగ్రి బిల్లులు, కుక్ కమ్ హెల్పర్ల వేతనాలు పెండింగ్ ఉండడంతో విద్యార్థులకు సరైన భోజనం అందడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇదిలా ఉంటె ప్రైవేటు స్కూల్స్ ఉపాధ్యాయులపై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని బిఆర్ఎస్ సీనియర్ నేత , మాజీ ఎంపీ వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. ప్రైవేట్ స్కూల్స్ పదో తరగతి ఫెయిల్ అయిన వారు ఉపాధ్యాయులు ఉన్నారని రేవంత్ చేసిన వ్యాఖ్యలపై మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also : Air India : ఎయిర్ ఇండియా ఫ్రీడమ్ సెల్..రూ.1,947 కే విమాన ప్రయాణం