అదానీ గ్రూపు అధినేత గౌతం అదానీ (Gautam Adani)ఫై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ‘యంగ్ ఇండియా’ స్కిల్స్ యూనివర్సిటీకి అదానీ గ్రూపు ఇస్తానన్న రూ. 100 కోట్ల విరాళాన్ని తీసుకునేది లేదని సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు. గత నాలుగైదు రోజులుగా అదానీ గ్రూపు వ్యవహారంపై తీవ్ర చర్చ జరుగుతున్న తరుణంలో తాము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు.
కొంతమంది కుట్రపూరిత దురుద్దేశంతో అదానీ గ్రూపునకు తెలంగాణ ప్రభుత్వంతో లింకులు పెడుతున్నారని రేవంత్ మండిపడ్డారు. ‘‘కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) పాలసీ కింద యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి రూ. 100 కోట్ల విరాళాన్ని ఇస్తామని అదానీ గ్రూపు తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మేం ఆ డబ్బులు తీసుకోవటానికి రెడీగా లేం. ఈవిషయాన్ని మేం లేఖ ద్వారా అదానీ గ్రూపునకు తెలియజేశాం’’ అని సీఎం రేవంత్ తెలిపారు. కాగా సీఎం తీసుకున్న ఈ నిర్ణయం పై మాజీ మంత్రి , బిఆర్ఎస్ నేత హరీష్ రావు స్పందించారు.
స్కిల్ యూనివర్సిటీకి ఇచ్చిన 100 కోట్లు నిధులు వెనక్కి తీసుకున్నారు సరే.. అదానీ అవినీతిపై రాహుల్ గాంధీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని నినదిస్తున్న సమయంలో దావోస్‌లో మీరు అదానీతో చేసుకున్న 12,400 కోట్ల ఒప్పందాల సంగతేంటని ప్రశ్నించారు. అదానీకి రాష్ట్రంలోని డిస్కంలను అప్పగించి వాటిని ప్రైవేటీకరించేందుకు మీరు చేస్తున్న కుట్రల మాటేమిటి..? అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ అవినీతి పరుడు అన్న వ్యక్తికే గల్లీ కాంగ్రెస్ రెడ్ కార్పెట్ పరిచిందని , ఢిల్లీలో రాహుల్ వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఆదానీతో రేవంత్ రెడ్డి దోస్తీ చేసి ఒప్పందాలు చేసుకున్నాడని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఇప్పుడు అదానీతో అవినీతి బయటికిరాగానే మాట మార్చేశారని , తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదానీతో చేసుకున్న ఒప్పందాలన్నింటినీ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి ఆదాని ఇచ్చిన 100 కోట్ల నిధులను వెనక్కి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న రేవంత్ రెడ్డి గారూ…
మరి, రాహుల్ గాంధీ గారు అదాని అవినీతి మీద జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని నినదిస్తున్న సమయంలో దావోస్ లో మీరు ఆదానితో చేసుకున్న 12,400 కోట్ల ఒప్పందాల… pic.twitter.com/XuxVIF7IgM
— Harish Rao Thanneeru (@BRSHarish) November 25, 2024
Read Also : Maharashtra : ముఖ్యమంత్రి అంశంపై స్పందించిన అజిత్ పవార్