Harish Rao : అబద్దాలతో కాంగ్రెస్‌ ప్రభుత్వం కాలం గడుపుతోంది

Harish Rao : నిన్న ఆర్బీఐ నివేదికతో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి నిజాలు బయటపడ్డాయని, కాంగ్రెస్ ప్రచారం చేసిన అబద్ధాలు తేలిపోయాయని హరీష్ రావు అన్నారు.

Published By: HashtagU Telugu Desk
Harish Rao

Harish Rao

Harish Rao : తెలంగాణ కాంగ్రెస్‌ వర్సెస్‌ బీఆర్‌ఎస్‌ నేతల మధ్య మాటల యుద్దం నడుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో నిధులు దుర్వినియోగం జరిగాయని, ప్రజలకు సంక్షేమ పథకాలు అందలేదని కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తుంటే.. పదేళ్లలో తెలంగాణను బంగారు తెలంగాణాగా మార్చామని బీఆర్‌ఎస్‌ నేతలు చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మరోసారి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్‌ రావు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. నిన్న ఆర్బీఐ నివేదికతో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి నిజాలు బయటపడ్డాయని, కాంగ్రెస్ ప్రచారం చేసిన అబద్ధాలు తేలిపోయాయని హరీష్ రావు అన్నారు. సిద్దిపేట బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం తన కాలంలో అబద్ధాల పునాదులపై ఏర్పడిందని, ఆ అబద్ధాలను ప్రచారం చేయడం ద్వారా తమ కాలం గడుపుతున్నదని ఆరోపించారు. ఆయన ప్రకారం, బీఆర్‌ఎస్‌ పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేసిన కాంగ్రెస్‌కు నిజాలు నిప్పులాంటివిగా బయటపడతాయని స్పష్టం చేశారు.

హరీష్ రావు అన్నారు, “పదేళ్ల మా పాలనపై కాంగ్రెస్ మంత్రులు, ముఖ్యమంత్రి రేవంత్ వివిధ దుష్ప్రచారాలు చేశారని, కానీ ఆ అన్ని తప్పుగా తేలిపోయాయి. RBI గణాంకాల ప్రకారం, కేసీఆర్ నడిపిన ప్రభుత్వంలో ప్రతి రంగంలోనూ అభివృద్ధి సాధించాం. తెలంగాణ వాస్తవంలో దివాలా రాష్ట్రం కాదు, దివ్యంగా వెలుగుతున్న రాష్ట్రం.”

అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుల రాష్టమైందని ప్రచారం చేసినా, అవి పూర్తిగా అబద్ధమని హరీష్ రావు మండిపడ్డారు. “2014, 2015 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రానికి 72,658 కోట్ల అప్పును ఇవ్వగా, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం 15,000 కోట్లు కొత్తగా అప్పు చేసింది. ఈ రెండు కలిపితే 1,06,000 కోట్ల అప్పు ఉండగా, బీఆర్‌ఎస్ హయాంలో 3,22,499 కోట్లు మాత్రమే అప్పు చేశాం” అని ఆయన తెలిపారు.

ఆర్బీఐ నివేదికపై మరింత వివరణ ఇచ్చిన హరీష్ రావు, కేంద్ర ప్రభుత్వ సూచనల ఆధారంగా విద్యుత్ ఉత్పత్తిలో 106% పెరుగుదల సాధించామని, 82 లక్షల ఎకరాలకు కొత్త నీరు అందించడంతో 105% పెరిగిన విషయాన్ని వెల్లడించారు. హరీష్ రావు, కాంగ్రెస్ నేతలు ఇప్పటికీ విషప్రచారం చేయకుండా, నిజాలను అంగీకరించాలని కోరారు.

Read Also : Duvvada Srinivas : దివ్వెల మాధురికి లైవ్‌లో ప్రపోస్‌ చేసిన దువ్వాడ శ్రీనివాస్‌.. వైరల్‌

  Last Updated: 12 Dec 2024, 06:15 PM IST