ప్రస్తుతం తెలంగాణ లో కాంగ్రెస్ vs బిఆర్ఎస్ మధ్య వాడివేడిగా వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. అసెంబ్లీ సమావేశాల్లో జస్ట్ కొట్టుకోవడమే తక్కువ అన్నట్లు ఇరు నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తుండడం తో ప్రజలు ఆసక్తి కనపరుస్తున్నారు. ఇదే క్రమంలో సోషల్ మీడియా లోను ఎవరెవరు ఏమాట్లాడుతున్నారు..? ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు..? ఆ వ్యాఖ్యల్లో ఎంత నిజం ఉంది..? అంటూ మాట్లాడుకుంటూ..పాత వీడియోస్ ను బయటకు తీస్తూ వైరల్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా హరీష్ రావు..సీఎం రేవంత్ తాలూకా ఓ ఓల్డ్ వీడియో పోస్ట్ చేసి వైరల్ గా మార్చారు.
We’re now on WhatsApp. Click to Join.
కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే అప్పట్లో హరీశ్ రావుకు మంత్రి పదవి వచ్చిందని అసెంబ్లీ లో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. 20 ఏళ్ల క్రితం నాటి ఓ పాత వీడియోను పోస్ట్ చేశారు. అందులో ఢిల్లీలో హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతుంటే.. వెనుక రేవంత్ రెడ్డి తొంగి తొంగి చూస్తున్నారు. ‘‘రేవంత్ రెడ్డి.. నాకు మంత్రి పదవి ఎవరి భిక్ష వల్లనో రాలేదు. సోనియా గాంధీ కోరిక మేరకు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో చేరాం తప్ప పదవుల కోసం కాదు. నాకు మంత్రి పదవి వచ్చినపుడు టీ ఆర్ఎస్‌నే ఉన్నావ్.. ఆ ఊరేగింపులోనూ ఉన్నావు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేసినప్పుడు కూడా నా వెనకే ఉన్నావ్, నిక్కి నిక్కి చూశావ్. ఇదంతా నీ కళ్ల ముందు జరిగిందే. కానీ ఇవేమి తెలియనట్లు చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నావు.
పదవులు, విలువల గురించి మాట్లాడే హక్కు నీకెక్కడిది రేవంత్ రెడ్డి. తెలంగాణ ఉద్యమంలో పదవులను గడ్డి పోచలుగా త్యజించిన చరిత్ర మాది. పూటకో పార్టీ మారిన రాజకీయ చరిత్ర నీది. పదవుల కోసం పెదవులు మూసుకున్న చరిత్ర నీది. ముఖ్యమంత్రి అయినప్పటికీ హుందాగా ప్రవర్తించడం లేదు. చీఫ్ మినిస్టర్ గా కాకుండా, చిల్లరగా మాట్లాడే చీప్ మినిస్టర్ గా వ్యవహరిస్తున్నావు.’’ అని హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు.
రేవంత్ రెడ్డి.. నాకు మంత్రి పదవి ఎవరి భిక్ష వల్లనో రాలేదు.
శ్రీమతి సోనియా గాంధీ గారి కోరిక మేరకు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో చేరాము తప్ప పదవుల కోసం కాదు.
నాకు మంత్రి పదవి వచ్చినపుడు టీ ఆర్ ఎస్ లోనే ఉన్నావ్.. ఆ ఊరేగింపులోనూ ఉన్నావు.
తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని… pic.twitter.com/uiU6hqDSPi
— Harish Rao Thanneeru (@BRSHarish) August 1, 2024
Read Also : Box Office : రేపు తెలుగులో ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయో తెలుసా..?