Chidambaram : చిదంబరం వ్యాఖ్యలపై మంత్రి హరీష్ రావు ఆగ్రహం

  • Written By:
  • Publish Date - November 16, 2023 / 07:41 PM IST

ఎన్నికల పోలింగ్ (TS Polls) సమయం దగ్గర పడుతుండడం తో నేతల మధ్య మాటల వార్ మరింత ముదురుతోంది. ఎక్కడ కూడా ఎవ్వరు తగ్గడం లేదు. లోకల్ నేతలనే కాదు జాతీయ స్థాయి నేతలపై కూడా విమర్శలు చేస్తూ వస్తున్నారు. తాజాగా నేడు ఎన్నికల ప్రచారం (Telangana Election Campaign)లో భాగంగా హైదరాబాద్ (Hyderabad)వచ్చిన ఆయన చిదంబరం (Chidambaram) గాంధీ భవన్ (Gandhi Bhavan)లో మాట్లాడుతూ..బిఆర్ఎస్ సర్కార్ (BRS Govt) ఫై విమర్శల వర్షం కురిపించారు.

తెలంగాణలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం బాగా పెరిగిపోయిందని చిదంబరం ఆరోపించారు. దేశంలోని అత్యధిక ద్రవ్యోల్బణం ఉన్న రాష్ట్రం తెలంగాణేనని అన్నారు. జాతీయ సగటు కన్నా ఎక్కువగా ఉందన్నారు. నిత్యావసర ధరలు బాగా పెరిగాయన్నారు. పాల ధరలు విపరీతంగా పెరిగాయని తెలిపారు. పెట్రోల్, డీజిల్ ధరలూ తెలంగాణలోనే ఎక్కువగా ఉన్నాయన్నారు. తెలంగాణలో అర్బన్ నిరుద్యోగం దేశంలో కన్నా ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువగా ఉందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న 80 వేల ఉద్యోగాలను భర్తీ చేయలేదన్నారు. దీంతో నిరుద్యోగం ఎక్కువగా ఉన్న రాష్ట్రంగా తెలంగాణ ఉందని స్పష్టం చేశారు. ఇది దేశ సగటు కన్నా ఎక్కువగా ఉందని చిదంబరం తెలిపారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీని కూడా అమలు పర్చలేదని చిదంబరం విమర్శించారు. నిరుద్యోగం, అధిక ధరల్ని నియంత్రించడంలో తెలంగాణలోని బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమయిందన్నారు. తెలంగాణ పర్భుత్వం అప్పు 3.66 లక్షల కోట్లకు చేరుకుందని చిదంబరం తెలిపారు. ప్రతి తెలంగాణ పౌరుడిపై అప్పు లక్షకు చేరుకుందని చిదంబరం ఆందోళన వ్యక్తం చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ తరుణంలో చిదంబరం వ్యాఖ్యలపై బిఆర్ఎస్ మంత్రి హరీష్ రావు (Harish Rao) ఆగ్రహం వ్యక్తం చేసారు. నాడు తెలంగాణ ప్రకటన చేసిన చిదంబరం.. దానిని వెనక్కి తీసుకున్న ఫలితంగా కదా ఉద్యమంలో యువకులు బలిదానం జరిగిందన్నారు. పొట్టి శ్రీరాములు గారి ప్రాణత్యాగం గురించి చిదంబరం మాట్లాడటం దొంగే దొంగ అన్నట్టుగా ఉందన్నారు. పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్రం గురించి ఉద్యమించినపుడు కేంద్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? అప్పటి నెహ్రు ప్రభుత్వం తాత్సారం చేయడం వల్లే కదా పొట్టి శ్రీరాములు చనిపోయింది? చరిత్ర తెలియనిది కేసీఆర్‌కు కాదు.. చిదంబరమే చరిత్ర తెలియకుండా వ‌క్ర భాష్యాలు చెబుతున్నారని దుయ్యబట్టారు. హైదరాబాద్ అనేది ఓ రాష్ట్రంగా ఉండేద‌నే విషయాన్ని ఆయ‌న మరిచిపోతున్నారు. తెలంగాణ అప్పులు, ఆదాయంపై చిదంబరం దుష్ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ ఆర్థిక క్రమశిక్షణ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల కన్నా ఎంతో బాగుందని గ్రహిస్తే మంచిది. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆర్బీఐ నివేదికలు ఏం చెబుతున్నాయో చిదంబరం తెలుసుకుంటే మంచిది అని సూచించారు.

చిదంబరం ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటే నమ్మేందుకు తెలంగాణ ప్రజలు అమాయకులు కార‌ని హ‌రీశ్‌రావు స్ప‌ష్టం చేశారు. కాంగ్రెస్‌కు ఒక్క ఛాన్స్ కాదు పదకొండు సార్లు అవకాశమిచ్చారు. చిదంబరానికి దమ్ముంటే తన సొంత రాష్ట్రం తమిళనాడులో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చే ప్రయత్నం చేయాలన్నారు.

Read Also : Chandrababu Bail : చంద్రబాబు బెయిల్ తీర్పు రిజర్వ్ చేసిన కోర్ట్ ..