Harish Rao: రేవంత్ మరియు భట్టిని అభినందించిన హరీష్ రావు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన అనంతరం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ట్విట్టర్ ఎక్స్ లో స్పందిస్తూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఉపముఖ్యమంత్రిగా నియమితులైన భట్టి విక్రమార్కను హరీష్ అభినందించారు.

Published By: HashtagU Telugu Desk
Harish Revanth Bhatti

Harish Revanth Bhatti

Harish Rao: తెలంగాణ నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ రోజు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి మరియు మంత్రులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు పలువురు నేతలు. తాజాగా మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన అనంతరం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ట్విట్టర్ ఎక్స్ లో స్పందిస్తూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఉపముఖ్యమంత్రిగా నియమితులైన భట్టి విక్రమార్కను హరీష్ అభినందించారు.

“రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి, ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన భట్టి విక్రమార్క, మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆశిస్తున్నాను. అని హరీష్ రావు తెలుగులో రాసిన పోస్ట్‌లో ట్వీట్ చేశారు.

Also Read: Ginger Tea : అల్లం టీ ఎక్కువగా తాగుతున్నారా? అయితే ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే…

  Last Updated: 07 Dec 2023, 07:23 PM IST