Minister Harish Rao : నా వల్ల రైతుబంధు ఆగలేదు – హరీష్ రావు

కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేయడంతోనే ఈసీ రైతుబంధుకు అనుమతి నిరాకరించిందన్నారు

  • Written By:
  • Publish Date - November 27, 2023 / 07:34 PM IST

రేపు రైతుల ఖాతాల్లో పడాల్సిన రైతు బంధు (Rythu Bandhu) డబ్బులు..మంత్రి హరీష్ రావు (Harish Rao) వల్లే పడకుండా పోయాయి అని..ఈసీ (EC) అనుమతి ఇచ్చినా.. హరీష్ రావు నోటిదూల, కేసీఆర్ (KCR) అతి తెలివి వల్ల… రైతు బంధు ఆగిందని, రైతుల ఖాతాల్లో పడాల్సిన రూ.5వేల కోట్లు ఆగిపోయాయని ..రైతుబంధు రాకపోవడానికి కారణమైన బీఆర్ఎస్ నేతలను తరిమికొట్టాలని రైతులకు రేవంత్ (Revanth Reddy) విజ్ఞప్తి చేయడాన్ని హరీష్ రావు ఖండించారు.

We’re now on WhatsApp. Click to Join.

కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేయడంతోనే ఈసీ రైతుబంధుకు అనుమతి నిరాకరించిందన్నారు. రైతు బంధును ఎన్ని రోజులు ఆపుతారని ప్రశ్నించారు. డిసెంబర్ 3 వరకు ఆపగలరని ఆ తర్వాత మళ్లీ వచ్చేది, ఇచ్చేది కేసీఆరేనని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ వాళ్లు రైతులకు ఇవ్వరని.. ఇచ్చిన వాళ్లను అడ్డుకునేటమే వారి పని అని చెప్పుకొచ్చారు. తెలంగాణ రైతులతో కేసీఆర్ ది పేగుబందమని ఓటు బంధం కాదని అన్నారు. గతంలో ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పకపోయినా రైతుబంధు ఇచ్చామని గుర్తు చేశారు. ఇప్పటివరకు ఈ పదేళ్లలో కెసిఆర్ ప్రభుత్వం రైతులపై ప్రేమతో 11 సార్లు రైతుబంధును ఇచ్చిందని ఓట్ల కోసం కాదని తెలిపారు. నా వల్లే నిధులు ఆగిపోయాయని ఆరోపణలు చేయడాన్ని ఖండిస్తున్నాని అన్నారు.

Read Also : Modi Road Show : మోడీ రాకతో కాషాయంగా మారిన హైదరాబాద్ రోడ్స్