Site icon HashtagU Telugu

Red Book : తెలంగాణలోనూ రెడ్ బుక్..

Telangana Redbook

Telangana Redbook

రెడ్ బుక్ (Red Book) ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా ఉన్న నారా లోకేష్ (Nara Lokesh) ప్రారంభించిన రెడ్ బుక్ కాన్సెప్ట్ ఇప్పుడు తెలంగాణలోకి వచ్చింది. అయితే తెలంగాణలో దీన్ని తెరిచింది బీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రముఖ నేత, మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao). తెలంగాణలో బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు, అధికారులెవ్వరైనా వేధించినట్లయితే వారి పేర్లు ఈ రెడ్ బుక్‌లో నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. పోలీస్ వ్యవస్థ, అధికార యంత్రాంగం తమ విధిని మరచి పని చేస్తే, వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే బీఆర్ఎస్ ప్రభుత్వం వారు తీసుకున్న చర్యలకు లెక్కలు తీసుకుంటుందని హెచ్చరించారు.

Thalliki Vandanam : రూ.15,000 నగదు ట్రాన్స్‌ఫర్‌కు ఏర్పాట్లు పూర్తి

ఇక బీఆర్ఎస్ బీజేపీతో పెట్టుకుంటుందనే ప్రచారాన్ని ఖండించారు హరీష్ రావు. బీఆర్ఎస్ ఎట్టి పరిస్థితుల్లో ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోదని, రాబోయే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ 100కి పైగా స్థానాల్లో విజయం సాధించి మళ్లీ అధికారంలోకి వస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. మహిళల కోసం వడ్డీ లేని 21 వేల కోట్ల రుణాలు ఇచ్చినట్లు రేవంత్ రెడ్డి చెబుతున్నదానికి ఆధారాలు చూపగలిగితే తాను రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు.

Tragedy : బీహార్‌లో దారుణం.. 9 ఏళ్ల దళిత బాలికపై అత్యాచారం.. ఆస్పత్రికి వెళితే..!

గోదావరి నదిపై ఏపీ నిర్మించే బనకచర్ల ప్రాజెక్ట్‌పై కూడా హరీష్ రావు స్పందించారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలంటే బీజేపీకి చెందిన తెలంగాణ ఎంపీలు తక్షణమే ఆ ప్రాజెక్ట్‌ను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జరిగిన కొందరు అధికారుల అసభ్య ప్రవర్తనలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ, సీసీ టీవీ ఫుటేజ్ విడుదల చేసి బాధ్యత వహించాలంటూ సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. రాష్ట్ర సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టినందుకు పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారా? అని ప్రశ్నిస్తూ, ప్రస్తుత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.