Site icon HashtagU Telugu

Harish Rao : పేద, గిరిజన పిల్లలంటే సీఎంకు చులకనా..?: హరీశ్ రావు

Harish Rao (3)

Harish Rao (3)

Food poisoning : బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి హరీష్‌రావు నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గురుకుల పాఠశాల బాలికలను మంగళవారం పరామర్శించారు. కొమరం భీం జిల్లా వాంకిడి మండల గిరిజన బాలికల రెసిడెన్షియల్ స్కూల్‌లో ఫుడ్‌పాయిజన్‌తో 60 మంది బాలికలు అస్వస్థతకు గురయ్యారు. అయితే వారిలో ముగ్గురు విద్యార్థినిల పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగానే హరీష్‌రావు బాలికలను పరామర్శించారు. అనంతరం ఆయన డియాతో మాట్లాడుతూ.. వెంటిలేటర్లపై విద్యార్థులు చావు బతుకుల మీదుంటే సీఎం రేవంత్ రెడ్డి స్పందించకపోవడం దారుణమని అన్నారు.

వెంటిలేటర్ పై ఉన్న విద్యార్థిని శైలజతో పాటు అస్వస్థతకు గురైన విద్యార్థినులందరికి కార్పోరేట్ వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. చికిత్స కోసం వచ్చిన విద్యార్థిని తల్లి కారిడార్ మీద అన్న పానీయాలు లేకుండా పడి ఉండగా వారికి భోజన వసతి సైతం ప్రభుత్వం కల్పించలేకపోవడం బాధకరమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వద్దనే గిరిజన శాఖ ఉందని, పిల్లల ప్రాణాలకంటే రాహుల్ గాంధీ పర్యటననే మీకు ముఖ్యమా అని ప్రశ్నించారు. అయితే సంఘటన జరిగి ఆరు రోజులైన దీనిపై సీఎం సమీక్ష చేయలేదని, 450మంది పిల్లలు విష అహారం తిని అస్వస్థత పాలైతే వారెమైపోయారన్నది కూడా సీఎం రేవంత్ రెడ్డి పట్టించుకోలేదన్నరు. పేద, గిరిజన పిల్లలంటే సీఎంకు చులకనా అని హరీశ్ రావు మండిపడ్డారు.

ముఖ్యమత్రి రేవంత్ రెడ్డి పాలనలో గురుకులాల్లో విష అహారాలు, పాములు, తేళ్ల కాట్లతో విద్యార్థుల ప్రాణాలకు భద్రత లేకుండా పోయిందని, గురుకులాల నుంచి తల్లిదండ్రులు తమ పిల్లల టీసీలు తీసుకుని వెళ్ళిపోయే దుస్థితిని కల్పించి కేసీఆర్ నెలకొల్పిన గురుకులాలను నిర్వర్యం చేశాడని విమర్శి్ంచారు. వాంకిడి గురుకుల విద్యార్థుల అనారోగ్యం ఘటనపై ప్రభుత్వం విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, ఈ ఘటనపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. విద్యార్థులంతా ఏయే ఆసుపత్రుల్లో ఉన్నారో గుర్తి్ంచి, వారి ఆరోగ్యం బాగయ్యేందుకు సరైన చికిత్స అందించేందుకు స్పెషల్ ఆఫీసర్లను నియమించాలని డిమాండ్ చేశారు.

Read Also : Rahul Gandhi : ఇప్పుడు చెయ్యమను తెలంగాణలో రాహుల్ యాత్ర ..? – బండి సంజయ్

Exit mobile version