తెలంగాణ రాజకీయాల్లో మాటల యుద్ధం మరింత వేడెక్కింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth )పై బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి హరీశ్ రావు (Harishrao) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావుపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని నంబర్ వన్‌గా తీర్చిదిద్దిన వ్యక్తిపై ఇటువంటి అసభ్య వ్యాఖ్యలు చేయడం తగదని ఆయన విమర్శించారు.
Shankh Naad: ఇంట్లో శంఖానాదం చేస్తే ఐశ్వర్యం కలిసి వస్తుందా.. పండితులు ఏం చెబుతున్నారంటే?
గతంలో రేవంత్ రెడ్డి కేసీఆర్ ను కాల్చిపారేయాలని అన్నారు. కేటీఆర్ కుమారుడిపై అసభ్యంగా మాట్లాడారు, తన (హరీశ్ రావు) ఎత్తు గురించి కూడా బాడీ షేమింగ్ చేశారు అని , రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు, బాడీ షేమింగ్ మామూలేనా? నువ్వు మనిషివా, పశువువా?” అని హరీశ్ రావు మండిపడ్డారు. రేవంత్ రెడ్డి వ్యవహార శైలి పూర్తిగా అసభ్యంగా మారిందని, ఆయన మాటల ద్వారా సమాజంలో నైతికత దెబ్బతింటోందని ఆరోపించారు.
AR Rahman : హాస్పటల్ నుండి రెహమాన్ డిశ్చార్జ్
ఇదే కాదు, రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధులను బెదిరిస్తూ, “బట్టలిప్పేసి రోడ్డుపై కొడతాం” అంటూ సంస్కారహీనంగా మాట్లాడారని హరీశ్ రావు విమర్శించారు. రేవంత్ రెడ్డి మాట్లాడే తీరు పూర్తిగా జుగుప్సాకరంగా మారిందని, ఇలాంటి భాష వినడం వల్ల పిల్లలు చెడిపోతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను పెద్ద నీతిమంతుడినని భావిస్తూ ఇతరులపై దూషణలకు దిగడం సరికాదని, ఈ తీరును మార్చుకోవాలని హరీశ్ రావు హితవు పలికారు.