Site icon HashtagU Telugu

Gurram Cheruvu Disappearing: గుర్రం చెరువును మింగేసిన రియల్టర్లు

Gurram Cheruvu Disappearing

Gurram Cheruvu Disappearing

Gurram Cheruvu Disappearing: బాలాపూర్ రోడ్డులోని గుర్రం చెరువు మాయమైంది. హైడ్రా పుట్టుకతో రోజుకో చెరువు వార్తల్లో నిలుస్తుంది. ఒకప్పుడు నీటి వనరుగా ఉపయోగించిన చెరువులు సైతం ఇప్పుడు కనిపించడం లేదు. కాగా 2020లో వరదల కారణంగా గుర్రం చెరుపు వార్తల్లో నిలిచింది. 2020లో వచ్చిన వరదల కారణంగా వందలాది మంది నిరాశ్రయులయ్యారు. ఆ సమయంలో పడవలను ఉపయోగించి ప్రజలను తరలించవలసి వచ్చింది. అయితే దశాబ్దాల క్రితం మంచి నీటితో కళకళలాడుతూ ప్రజల దాహార్తి తీర్చిన ఇదే గుర్రం చెరువు ఇప్పుడు రియట్లర్ల బారీన పడింది. వందల ఎకరాలు మాయమయ్యాయి.

గతంలో గుర్రం చెరువు(Gurram Cheruvu) కింద ఉన్న హఫీజ్‌బాబానగర్‌, ఘాజీయే మిలత్‌ కాలనీ, ఫూల్‌బాగ్‌, నసీబ్‌నగర్‌, కందిగల్‌ గేట్‌, కృష్ణారెడ్డి నగర్‌, శివాజీనగర్‌, సాయిబాబానగర్‌, అరుంధతీ కాలనీ, గుల్షన్‌ఎక్బాల్‌ కాలనీ, ఆయేషా కాలనీ, యూసుఫియన్‌ కాలనీ, రక్షాపురం, ఫతేషానగర్‌ ప్రాంతాలలోని వందల ఎకరాల వ్యవసాయ భూములను సాగు చేసేవారు. కానీ హైదరాబాద్ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని చెరువుపై కన్నేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారాలు వ్యవసాయ భూములను ఫ్లాట్లుగా మార్చేశారు. దీంతో ఎఫ్‌టీఎల్‌ పరిధిలో కూడా వందల సంఖ్యలు ఇల్లు పుట్టుకొచ్చాయి.

Also Read: WTC Points Table: శ్రీలంకపై ఇంగ్లండ్ ఓట‌మి.. WTC పాయింట్ల ప‌ట్టిక‌లో మార్పులు..!

బాలాపూర్(Balapur) మండలంలోని ప్రధాన సరస్సులలో ఒకటైన గుర్రం చెరువు 90 ఎకరాలకు పైగా ఉన్నట్లు అధికారికంగా అందరికీ తెలుసు. కానీ దశాబ్ద కాలంలోనే దాని పరిమాణంలో దాదాపు మూడింట ఒక వంతుకు కుంచించుకుపోయింది. దీనివల్ల నీటి వనరులు దాదాపుగా కనుమరుగయ్యాయి. ముఖ్యంగా దక్షిణం వైపున భారీగా నివాస కాలనీలు వెలిశాయి. చెరువు చుట్టూ ప్రక్కల విస్తరణ ఎలా సాగిందంటే బఫర్ జోన్‌ను దాటి ముందుకు వచ్చింది. జిహెచ్‌ఎంసి సర్వే నిర్వహించినప్పుడు 2014లో నీటి విస్తరణ విస్తీర్ణం 38.72 ఎకరాలు, ఎఫ్‌టిఎల్ వరకు ట్యాంక్ విస్తీర్ణం 90.69 ఎకరాలు. ఈ సరస్సు 789 మీటర్ల బండ్‌ను కలిగి ఉంది. అయితే దీని ఉల్లంఘన ద్వారా సమీప ప్రాంతాలలో వినాశనాన్ని సృష్టించింది.

2019లో వరదలు రావడానికి ఒక సంవత్సరం ముందు సరస్సును ఆక్రమించారనే ఆరోపణలపై స్థానిక కార్పొరేటర్‌పై కూడా కేసు నమోదైంది. బాలాపూర్ మండల తహశీల్దార్ ఫిర్యాదు మేరకు కార్పొరేటర్‌తో పాటు ఇతరులపై ఐపీసీ, నీటిపారుదల చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఎఫ్‌టీఎల్‌ పరిధిలోనే సరస్సును కంకరతో నింపి ఉపరితలాన్ని చదును చేస్తున్నారని ఆరోపించారు. కాగా ఇటీవల, పర్యావరణ మరియు సామాజిక కార్యకర్త డాక్టర్ లుబ్నా సర్వత్ బండ్లగూడ మండలంలో అనేక సరస్సులు ఎలా ఆక్రమణకు గురయ్యాయో చెప్పారు. సరస్సుల నిజమైన విస్తీర్ణాన్ని గుర్తించడానికి మరియు ఆక్రమణలను నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం మరియు హైడ్రా కూడా సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్‌లను సూచించాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. 2020 వరదల సమయంలో చాలా ప్రాంతాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నాయి. ఈ ప్రాంతంలో చెరువులు, నాలాలు పూర్తిగా ఆక్రమణకు గురయ్యాయి. సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్‌లను పక్కపక్కనే ఉంచుతూ ప్రస్తుత పరిస్థితిని గమనించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, హైడ్రా చైర్మన్‌లను కోరుతున్నాం అని కోరారు.

Also Read: TS High Court : బీసీ కుల గణనపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు