Chief Security Officer : సీఎం రేవంత్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా గుమ్మి చక్రవర్తి

Chief Security Officer : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన టీమ్‌ను తయారు చేసుకుంటున్నారు.

Published By: HashtagU Telugu Desk
Chief Security Officer

Chief Security Officer

Chief Security Officer : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన టీమ్‌ను తయారు చేసుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సెక్యూరిటీ ఆఫీసర్‌గా గుమ్మి చక్రవర్తి(Chief Security Officer) నియమితులయ్యారు. ఈ మేరకు డీజీపీ రవి గుప్త ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం చక్రవర్తి నార్కోటిక్ బ్యూరో ఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు. అనతి కాలంలోనే డ్రగ్స్ అక్రమ రవాణాను అడ్డుకట్ట వేయడంలో కీలకంగా వ్యవహరించారు. ముఖ్యంగా నార్కోటిక్ బ్యూరోలో అతని పాత్ర కీలకంగా ఉంది. హైదరాబాద్‌లో డ్రగ్స్ మూలాలను బయటకు తీసిన అధికారిగా చక్రవర్తికి గుర్తింపు ఉంది.ఇక ఇప్పటికే తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్ గా సీనియర్ ఐపిఎస్ అధికారి శివధర్ రెడ్డిని సీఎం రేవంత్ నియమించారు. అలాగే ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీగా శేషాద్రి నియమితులయ్యారు.

We’re now on WhatsApp. Click to Join.

తెలంగాణలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసు శాఖలో బదిలీలు, నియామకాలపైనా ఫోకస్ పెట్టింది. ఈక్రమంలోనే మూడు కమిషనరేట్లకు నూతన కమిషనర్లను నియమించింది. హైదరాబాద్ సీపీగా కొత్తకోట శ్రీనివాసరెడ్డి,  సైబరాబాద్ సీపీగా అవినాష్ మొహంతీ, రాచకొండ సీపీగా సుధీర్ బాబును(New CPs) నియమించారు. యాంటీ నార్కోటిక్స్ వింగ్ డైరెక్టర్‌గా  సందీప్ శాండిల్యను నియమించారు. సందీప్ శాండిల్య.. ఎన్నికల వేళ హైదరాబాద్ సీపీగా పనిచేశారు. కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఇప్పటివరకూ తెలంగాణ ఆర్గనైజేషన్స్ అండ్ లీగల్‌ విభాగానికి అడిషనల్ డీజీపీగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడాయన హైదరాబాద్ సీపీ అవుతున్నారు. ఐపీఎస్ సుధీర్ బాబు ప్రస్తుతం హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ అడిషనల్ సీపీగా ఉన్నారు. ఆయన ఇప్పుడు రాచకొండ సీపీగా బదిలీ అయ్యారు. అవినాష్ మొహంతీ సైబరాబాద్‌లో జాయింట్ సీపీగా ఉన్నారు. ఆయన ఇప్పుడు సైబరాబాద్ సీపీగా బదిలీ అయ్యారు. వీరందర్నీ వెంటనే బాధ్యతలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది.మరోవైపు తెలంగాణలో భారీగా ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల బదిలీకి కూడా కసరత్తు జరుగుతోంది.

Also Read: Telangana Irrigation: తెలంగాణ ఇరిగేషన్ కు ప్రక్షాళన..

  Last Updated: 12 Dec 2023, 03:25 PM IST