Site icon HashtagU Telugu

Gruha Jyoti Scheme : మీకు ఫ్రీ కరెంట్ రావడం లేదా..అయితే అప్లై చేసుకోవచ్చు – భట్టి

Gruha Jyothi Telangana

Gruha Jyothi Telangana

తెలంగాణ లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ (Congress Party) అధికారంలోకి వచ్చిందంటే దానికి కారణం..ఉచిత హామీలే. ఫ్రీ బస్సు , ఫ్రీ కరెంట్ , రూ. 500 లకే గ్యాస్ సిలెండర్, రైతు రుణమాఫీ , ఇందిరమ్మ ఇల్లు ఇలా ప్రధాన హామీల వల్ల ఈరోజు కాంగ్రెస్ అధికారంలో వచ్చింది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్..ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ వస్తుంది. ముందుగా ఫ్రీ బస్సు , ఫ్రీ కరెంట్ లను అమలు చేసింది. గృహ జ్యోతి పథకం (Gruha Jyoti Scheme) కింద నెలకు 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ను అందజేస్తుంది. కాగా ఈ పథకం కోసం అప్లై చేసిన దరఖాస్తు పత్రంలో పలు అనుమానాలతో చాలామంది క్లిక్ చేసుకోలేదు. దీంతో వారికీ ఫ్రీ కరెంట్ అనేది రాకుండా పోయింది. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం భట్టి (deputy cm bhatti vikramarka)..తీపి కబురు అందించారు.

We’re now on WhatsApp. Click to Join.

గృహజ్యోతి పథకం కోసం మళ్లీ దరఖాస్తులను అర్హులైన వారి నుంచి స్వీకరణ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమంలో భాగంగా అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చాలన్న ఉద్దేశంతో మరోసారి దరఖాస్తులను తీసుకోవాలని ప్రభుత్వం భావించింది. అర్హత ఉన్నప్పటికీ గతంలో దరఖాస్తులు చేయనివారి నుంచి అప్లికేషన్లు తీసుకోవాల్సిందిగా ఆయన నిర్దేశించారు. మహాత్మ జ్యోతిబాపూలే ప్రజా భవన్‌లో ఇంధనశాఖతోపాటు డిస్కమ్ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు వివిధ అంశాలపై కీలక ఆదేశాలను జారీ చేశారు. రాజకీయ కారణాలు, ఇతర సాంకేతిక ఇబ్బందులు వల్ల అనేక మంది దరఖాస్తు చేయలేని పరిస్థితి ఏర్పడింది. అటువంటి వారికి అవకాశం కల్పించాల్సిందిగా ఉపముఖ్య మంత్రి దృష్టికి పలువురు సమస్యను తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆయన అధికారులకు తాజాగా ఆదేశాలు ఇచ్చారు.

Read Also : Hindupur TDP : టీడీపీ ఖాతాలో హిందూపురం మున్సిపాలిటీ..?