Site icon HashtagU Telugu

Group 2 Student Suicide : ‘గ్రూప్ 2’ అభ్యర్థిని ఆత్మహత్య ? సూసైడ్ లెటర్ వైరల్

92% Marks Suicide

92% Marks Suicide

Group 2 Student Suicide : హైదరాబాద్‌లో ఉంటూ గ్రూప్‌ 2 ఎగ్జామ్ కు ప్రిపేర్ అవుతున్న మర్రి ప్రవళిక అనే యువతి సూసైడ్ చేసుకుంది. హైదరాబాద్ లోని చిక్కడపల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ హాస్టల్‌లో ఉంటూ గ్రూప్ 2కు ప్రిపేర్ అవుతున్న వరంగల్ జిల్లా బిక్కాజిపల్లికి చెందిన ఆమె ఆత్మహత్యతో కలకలం రేగింది. శుక్రవారం సాయంత్రం హాస్టల్‌లోని ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆమె బలవన్మరణానికి పాల్పడిందని అంటున్నారు.  గ్రూప్ 2 పరీక్ష వాయిదా పడటంతో మనస్థాపానికి గురై ఆమె సూసైడ్ చేసుకుందని ఆరోపిస్తూ పలువురు గ్రూప్‌ 2 అభ్యర్థులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం స్పందించే వరకు మృతదేహాన్ని కదలనివ్వబోమన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నిరసనలో బీజేపీ సీనియర్ లీడర్ లక్ష్మణ్, బండారు విజయలక్ష్మి పాల్గొన్నారు. అయితే పోలీసులు లాఠీ ఛార్జ్ చేసి వారిని చెదరగొట్టారు. కేసు నమోదు చేసి మృతదేహాన్నిపోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. శుక్రవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు ఈ హైడ్రామా కొనసాగింది.

We’re now on WhatsApp. Click to Join.

ఇక శనివారం ఉదయాన్నే ప్రవళిక తల్లి హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి వచ్చి.. కూతురి మృతదేహాన్ని చూసి కుప్పకూలిపోయారు. ప్రభుత్వ ఉద్యోగంతో ఇంటికి వస్తుందని అనుకుంటే ఇలా అయిందంటూ ప్రవళిక తల్లి కన్నీరు మున్నీరయ్యారు.  ప్రవళిక రాసిందని ప్రచారం జరుగుతున్న ఓ సూసైడ్ నోట్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘‘అమ్మా నన్ను క్షమించండీ’’ అంటూ మొదలు పెట్టిన ఆ లేఖలో పలు అంశాలను ప్రవళిక ప్రస్తావించింది. ‘‘నేను నష్టజాతకురాలిని. నా వల్ల పేరెంట్స్‌కు ఎప్పుడూ బాధలే. మీకు నేను చాలా అన్యాయం చేశాను. నా కాలు కిందపెట్టకుండా చూసుకున్న అమ్మకు ధన్యవాదాలు. అమ్మ కోసం ఏం చేయలేకపోతున్నందుకు (Group 2 Student Suicide) క్షమించాలి’’ అని  లేఖను ప్రవళిక ముగించింది.

Also Read: Narendra Modi Stadium: నేడే పాక్- భారత్ మ్యాచ్.. లక్ష మంది ప్రేక్షకులు, 11 వేల మంది సెక్యూరిటీ..!