Site icon HashtagU Telugu

Group 1 : గ్రూప్‌ -1 ప్రిలిమ్స్ రిజల్ట్ వచ్చేసింది.. చెక్ చేయడం ఇలా

Tspsc Group 1

Group 1 : తెలంగాణలో నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ రిజల్ట్ రిలీజ్ అయ్యాయి. దీంతోపాటే ప్రిల్సిమ్స్ తుది కీ కూడా ఇవాళే విడుదలైంది. ప్రిలిమ్స్ పరీక్ష నుంచి గ్రూప్​-1 మెయిన్స్​కు 31,382 మంది అభ్యర్థులు అర్హత సాధించారని టీజీపీఎస్సీ ప్రకటించింది. ప్రిలిమ్స్ ఫలితాలను తమ అధికారిక వెబ్​సైట్​లో చెక్ చేసుకోవచ్చని అభ్యర్థులకు సూచించింది.

We’re now on WhatsApp. Click to Join

ప్రాథమిక కీపై అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలు పరిశీలించిన తర్వాత తుదికీని విడుదల చేశామని వెల్లడించింది. అక్టోబర్​ 21 నుంచి 27 వరకు గ్రూప్​ 1(Group 1)  మెయిన్స్​ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. పరీక్షకు వారం ముందు నుంచే అభ్యర్థులు హాల్​ టికెట్లు ​డౌన్​లోడ్​ చేసుకోవచ్చని సూచించింది. వాస్తవానికి గ్రూప్ -1 (Group 1) ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించిన ప్రిలిమినరీ కీని జూన్​ 13న టీజీపీఎస్సీ(TGPSC) విడుదల చేసింది. ప్రిలిమినరీ కీతో పాటు ప్రశ్నపత్రాన్ని అభ్యర్థుల లాగిన్​లో అందుబాటులో ఉంచింది.

Also Read : Food Packets : ఫుడ్ ప్యాకెట్లపై పోషకాల సమాచారం పెద్ద అక్షరాల్లో..

గ్రూప్-1 మెయిన్స్‌ పరీక్షకు అభ్యర్థుల ఎంపికపై టీజీపీఎస్‌సీ నాలుగు రోజుల క్రితమే కీలక ప్రకటన చేసింది. మెయిన్స్ పరీక్ష కోసం అభ్యర్థులను 1:50 నిష్ఫత్తి ప్రకారమే ఎంపిక చేస్తామని వెల్లడించింది. 1:100 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక సాధ్యమయ్యే విషయం కాదని టీజీపీఎస్‌సీ తేల్చి చెప్పింది. ఈమేరకు ఒక మెమోను జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వ జీఏడీ  విభాగం జారీ చేసిన జీవోల ప్రకారం గ్రూప్ 1 మెయిన్స్‌ పరీక్షకు 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేస్తామని టీజీపీఎస్‌సీ  వెల్లడించింది.

Also Read :Telugu States : సరైన దిశలో ఒక అడుగు..!

గ్రూప్-1 మెయిన్స్ షెడ్యూల్

గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలో మొత్తం 6 పేపర్లు ఉంటాయి. జనరల్ ఇంగ్లిష్ (క్వాలిఫయింగ్ పేపర్) పరీక్ష అక్టోబర్ 21న, పేపర్-I (జనరల్ ఎస్సే) పరీక్ష అక్టోబర్ 22న, పేపర్-II (చరిత్ర, సంస్కృతి, భూగోళశాస్త్రం) పరీక్ష అక్టోబర్ 23న, పేపర్ -III (ఇండియన్ సొసైటీ, రాజ్యాంగం, అడ్మినిస్ట్రేషన్) పరీక్ష అక్టోబర్ 24న, పేపర్ -IV (ఎకానమీ, డెవలప్‌మెంట్) పరీక్ష అక్టోబర్ 25న, పేపర్- V (సైన్స్ అండ్‌ సాంకేతికత, డేటా ఇంటర్‌ప్రిటేషన్ ) పరీక్ష అక్టోబరు 26న, పేపర్-VI (తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర నిర్మాణం) పరీక్ష అక్టోబర్ 27న జరుగుతుంది.

Also Read :Maruti Brezza: మారుతి బ్రెజ్జా నుంచి కొత్త ఎడిష‌న్‌.. ప్ర‌త్యేక‌త‌లు ఏంటంటే..?