Site icon HashtagU Telugu

Green India Challenge: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు మరో అవార్డు!

Green India

Green India

పచ్చని పర్యావరణం కోసం అలుపెరగని కృషి చేస్తూ, దేశ వ్యాప్తంగా పచ్చదనం పెంపుపై అవగాహన కల్పిస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరో అవార్డును సొంతం చేసుకుంది. గ్రీన్ ఛాలెంజ్ ఆద్యులు, రాజ్యసభ ఎం.పీ జోగినపల్లి సంతోష్ కుమార్ ను గ్రీన్ రిబ్బన్ ఛాంపియన్ గా గుర్తిస్తూ ప్రముఖ జాతీయ మిడియా సంస్థ నెట్ వర్క్ 18 గ్రూప్ అవార్డును అందించింది.  గతవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో అనివార్య కారణాల వల్ల ఎం.పీ హాజరు కాలేక పోయారు.

దీంతో ఇవాళ నెట్ వర్క్ 18 గ్రూప్ ప్రతినిధి ఎం.పీ సంతోష్ కుమార్ ను హైదరాబాద్ లో కలిసి అవార్డును అందించారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపు, సామాజిక స్ప్రహ, అన్ని వర్గాల ప్రాతినిధ్యానికి కృషి, దేశ వ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను గ్రీన్ అంబాసిడర్లుగా ప్రమోట్ చేస్తున్నందుకు సంతోష్ కుమార్ గ్రీన్ రిబ్బన్ ఛాంపియన్ గా ఎంపికైనట్లు నెట్ వర్క్ 18 గ్రూప్ తెలిపింది. పర్యావరణ మార్పుల వల్ల మానవాళికి పొంచిఉన్న పెను ముప్పుపై అవగాహన కల్పించేందుకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేస్తున్న కృషి అమోఘమని సంస్థ ప్రతినిధులు అన్నారు.

Also Read: YS Sharmila: కేసీఆర్ కు షాక్.. రేవంత్, బండికి షర్మిల ఫోన్!