Teenmar Mallanna : విజయం దిశగా తీన్మార్ మల్లన్న.. 6వేలకుపైగా ఓట్ల ఆధిక్యం

తీన్మార్​ మల్లన్న విజయం దిశగా దూసుకుపోతున్నారు.

  • Written By:
  • Updated On - June 6, 2024 / 07:46 AM IST

Teenmar Mallanna : తీన్మార్​ మల్లన్న విజయం దిశగా దూసుకుపోతున్నారు. నల్గొండ – ఖమ్మం – వరంగల్​ గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో రెండో రౌండ్ ముగిసే సమయానికి ఆయన 6వేలకుపైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ప్రస్తుతం చెల్లని ఓట్లను వేరే చేసే ప్రాసెస్ జరుగుతోంది.  రెండవ రౌండ్‌లో 96వేల మొదటి ప్రాధాన్యత ఓట్ల కౌంటింగ్ పూర్తయింది.  ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ కాంగ్రెస్ (తీన్మార్ మల్లన్న), బీఆర్ఎస్ (రాకేశ్‌రెడ్డి) మధ్యే జరుగుతోంది. బీజేపీ అభ్యర్థి (ప్రేమేందర్‌రెడ్డి) మూడో స్థానంలో ఉన్నారు. దీంతో కౌంటింగ్​ హాల్​లో ఏజెంట్లు, అభ్యర్థులు ప్రతి బ్యాలెట్​ను క్షుణ్ణంగా చెక్ చేస్తున్నారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియ గురువారం సాయంత్రం పూర్తయ్యే ఛాన్స్ ఉంది. నల్గొండలోని దుప్పలపల్లి గిడ్డంగుల సంస్థ గోదాముల్లో బుధవారం ఉదయం 8 గంటల నుంచి ఈ ఓట్ల లెక్కింపు జరుగుతోంది.

We’re now on WhatsApp. Click to Join

ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో  52 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. దీంతో జంబో బ్యాలెట్​ను వాడుతున్నారు. సాధారణంగా నైతే ప్రతి 3 గంటలకు ఒక రౌండ్​ ఫలితాన్ని అనౌన్స్ చేయాలి. అయితే జంబో బ్యాలెట్​ కావడంతో ఓపెన్​ చేసిన ప్రతి బ్యాలెట్​ పేపర్​ను మూడు టేబుళ్లకు మార్చాల్సి వస్తోంది. బ్యాలెట్​ పేపరు పెద్దగా ఉండటం, టేబుళ్లు చిన్నగా ఉండటంతో ఓపెన్​ చేసిన బ్యాలెట్​ పేపర్​ను  ఏజెంట్లు చెక్ చేశాకే క్లోజ్ చేస్తున్నారు. దీంతో ఓట్ల లెక్కింపునకు ఎక్కువ టైం పడుతోంది.

Also Read :Nitish-Chandrababu: న‌రేంద్ర మోదీ ప్ర‌ధాని కావాలంటే.. చంద్ర‌బాబు, నితీష్‌దే కీల‌క పాత్ర‌..!

అంతకుముందు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు మొదటి రౌండ్‌‌లో తీన్మార్‌ మల్లన్నకు 36,210 ఓట్లు, రాకేశ్‌రెడ్డికి 28,540 ఓట్లు,  ప్రేమేందర్‌రెడ్డికి 11,395 ఓట్లు వచ్చాయి. తొలి రౌండ్‌లో మొత్తం 96,097 ఓట్లు ఉండగా.. వాటిలో చెల్లిన ఓట్లు 88,369,  చెల్లని ఓట్లు 7,728. కాగా, మొత్తం 605 పోలింగ్‌ కేంద్రాల్లో పోలైన 3.36 లక్షల బ్యాలెట్‌ పత్రాలను 25 చొప్పున తొలుత కట్టలు కట్టారు. ఒక్కో కౌంటింగ్ హాల్లో 24 టేబుళ్ల చొప్పున మొత్తం నాలుగు గదుల్లో 96 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్‌పై వేయి చొప్పున ఒక రౌండ్‌లో మొత్తం 96 వేల ఓట్లను మొదటి ప్రాధాన్య క్రమంలో లెక్కిస్తున్నారు. తొలి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు నాలుగు రౌండ్లలో పూర్తి కానుంది. సుదీర్ఘంగా సాగే ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని ఆయా పార్టీల అభ్యర్థులు సూచించారు.

Also Read :Mahesh Babu: చంద్రబాబు, పవన్ గెలుపుపై మహేశ్ అదిరే ట్వీట్