Telangana Belt Shops: తెలంగాణలో బెల్టు షాపులపై కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ అయింది. తెలంగాణలో విచ్చల విడిగా నడుస్తున్న బెల్టు షాపులపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కు పాదం మోపేందుకు సన్నాహాలు ముమ్మరం చేసింది. రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఎక్సైజ్ శాఖ అధికారులు దూకుడు పెంచారు.చట్టాన్ని అతిక్రమిస్తే నిర్వాహకులపై క్రిమినల్ కేసులు పెట్టి ఉక్కుపాదం మోపి అనిచే యోచనలో రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకోనుంది. బెల్టు షాపుల వల్ల తాగుడుకు బానిసలయ్యే వారి సంఖ్య భారీగా పెరిగి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, బెల్టు షాపుల మూసివేతను నిబద్ధతతో అమలుపరుస్తే లక్షలాది కుటుంబాలకు కొద్దిపాటి మేలు జరిగే అవకాశం ఉందని రేవంత్ ప్రభుత్వం యోచిస్తుంది.
గత ప్రభుత్వంలో తెలంగాణలో బెల్టు షాపులు యథేచ్ఛగా పెరిగాయి. పగలు రాత్రి అనే తేడా లేకుండా బెల్టు షాపు యజమానుదారులు స్థానికంగా ఉన్న వైన్స్ దుకాణాల నుండి కొనుగోలు చేసిన మద్యాన్ని అధిక ధరలకు అమ్మారు. దీంతో మద్యం ఏరులై పారింది. మహిళలు అనేకసార్లు ప్రభుత్వాన్ని మొరపెట్టుకున్నా కేసీఆర్ పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. మరి కాంగ్రెస్ ప్రభుత్వం అయినా బెల్టు షాపులపై చర్యలు తీసుకోవాలని మహిళలు కోరుతున్నారు.
Also Read: Hyderabad : బిజెపి – బిఆర్ఎస్ ఎమ్మెల్యేలపై టీ కాంగ్రెస్ పిర్యాదు