Site icon HashtagU Telugu

Governor Tamilisai : రిపబ్లిక్ డే ప్రసంగంలోను బిఆర్ఎస్ సర్కార్ ఫై మండిపడ్డ గవర్నర్

Governor Tamilisai Speech O

Governor Tamilisai Speech O

భారత 75 వ గణతంత్ర దినోత్సవాలు (Republic Day 2024) దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ గవర్నర్ తమిళసై (Governor Tamilisai) గణతంత్ర దినోత్సవం సందర్బంగా గత ప్రభుత్వం బిఆర్ఎస్ (BRS) ఫై విమర్శల వర్షం కురిపించింది. హైదరాబాద్‌ నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన గణతంత్ర దినోత్సవాల్లో గవర్నర్ తమిళిసై పాల్గొన్నారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకావిష్కరణ చేశారు.

అనంతరం మాట్లాడిన గవర్నర్.. తన ప్రసంగంలో గత ప్రభుత్వంపై కీలక కామెంట్స్ చేశారు. గత ప్రభుత్వ అసమర్థ విధానాలతో ఆర్థికస్థితి దిగజారిందన్నారు. ఏకపక్ష నిర్ణయాలు, నియంత పోకడలు ఎప్పుడూ ప్రజాస్వామ్యానికి శోభనివ్వవని తెలిపారు. తెలంగాణలో గత పదేళ్లలో పాలకులు రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా వ్యవహరించారన్నారు. తెలంగాణ సమాజం ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందని చెప్పారు. ఇటీవల ఎన్నికల్లో నియంతృత్వ ధోరణికి ప్రజలు తమ తీర్పు ద్వారా చరమగీతం పాడారన్నారు. అహంకారం, నియంతృత్వం చెల్లదని ప్రజలు స్పష్టమైన తీర్పు ప్రకటించారన్నారు. పదేళ్ల పాలనలో రాజ్యాంగ విలువలు, రాజ్యాంగబద్ధ సంస్థలు, వ్యవస్థలు ధ్వంసమయ్యాయని.. ఈ ప్రజా ప్రభుత్వంలో ఇప్పుడిప్పుడే మళ్లీ పునర్ నిర్మించుకుంటున్నామని చెప్పుకొచ్చారు. కొత్తగా ఏర్పడిన ప్రజా ప్రభుత్వం ఈ స్పృహతో పని మొదలు పెట్టిందని.. సమాజంలోని అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు దక్కాలన్న లక్ష్యంతో పని చేస్తోందన్నారు. టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన మెుదలైంది.. త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ మెుదలవుతుందని చెప్పారు. ఈ విషయంలో యువత అపోహలు, అనుమానాలకు పోవాల్సిన పని లేదని అన్నారు. వంద రోజుల్లో అన్ని గ్యారంటీలను అమలు చేసేందుకు ప్రజా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ప్రజల ఉద్యమ ఆకాంక్షలే ఈ ప్రభుత్వ ప్రాధాన్యాలు. ప్రతి అర్హుడికి సంక్షేమ ఫలాలు అందించడం ప్రభుత్వ బాధ్యత. అందుకే డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ప్రజల నుంచి పథకాల కోసం దరఖాస్తులు స్వీకరించాం. ఈ కార్యక్రమంలో 1,25,84,383 దరఖాస్తులు ప్రభుత్వానికి అందాయి. వీటిలో ఐదు గ్యారెంటీలకు సంబంధించి 1,05,91,636 దరఖాస్తులు కాగా, ఇతర అభ్యర్థనలకు సంబంధించి 19,92,747 దరఖాస్తులు అందాయి. ఈ దరఖాస్తులను ప్రస్తుతం శాఖల వారిగా క్రోడీకరించి, కంప్యూటరీకరించి వాటి పరిష్కారానికి కార్యచరణ ప్రణాళిక రూపొందుతోంది అని చెప్పుకొచ్చారు. ఈ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు అధికారులు పాల్గొన్నారు.

Read Also : Republic Day 2024 : మన రిపబ్లిక్ డే చారిత్రక విశేషాలు ఇవిగో