Site icon HashtagU Telugu

Tamilisai Decision on Pending Bills: పెండింగ్ బిల్లులపై గవర్నర్ తమిళిసై కీలక నిర్ణయం

Telangana Pending Pills

Governor Tamilisai Key Decision On Pending Bills

Tamilisai Decision on Pending Bills : తెలంగాణాలో రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ కు అస్సలు పొసగడం లేదు. ప్రభుత్వ కార్యకలాపాల్లోనూ ఇద్దరికీ సఖ్యత కుదరడం లేదు. గత కొన్ని నెలలుగా ఈ పరిస్థితి నెలకొనడంతో ప్రగతి భవన్ కు, రాజ్ భవన్ కు మధ్య దూరం పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రోటోకాల్ పాటించడం లేదని గవర్నర్ ఆరోపిస్తుండగా… అభివృద్ధికి గవర్నర్ మోకాలడ్డుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఇదిలా ఉండగా తాజాగా పెండింగ్ లో ఉన్న బిల్లులకు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఆమోదం తెలపడం హాట్ టాపిక్ గా మారింది.

తెలంగాణ శాసనసభ, శాసనమండలి ఆమోదం తెలిపిన బిల్లులు గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులను గవర్నర్ పూర్తిగా పరిశీలించి ఆమోదం తెలుపుతారు. అయితే పెండింగ్ బిల్లులపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులకు గవర్నర్ మోకాలడ్డుతున్నారని ఆరోపిస్తూ కోర్టుకెక్కింది. నేడు సుప్రీం కోర్టులో పెండింగ్ బిల్లులపై విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో పెండింగ్ లో ఉన్న మూడు బిల్లులపై గవర్నర్ తమిళిసై (Tamilisai) కీలక నిర్ణయం తీసుకున్నారు. పెండింగ్ లో ఉన్న మూడు బిల్లులకు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఆమోదం తెలపడం ప్రాధాన్యత సంతరించుకుంది. పెండింగ్ లో ఉన్న వాటిలో మూడు బిల్లులకు ఆమోదం తెలపగా… రెండు బిల్లులను రాష్ట్రపతికి పంపించారు. అలాగే మరో రెండు బిల్లులను రాష్ట్ర ప్రభుత్వానికి రిటర్న్ చేశారు.

Also Read:  Jagan & KCR on Vizag Steel: విశాఖ స్టీల్ పై జగన్, కేసీఆర్ వ్యూహం! నెక్స్ట్ మచిలీపట్నం ఓడరేవు!