TSPSC Paper Leak : TSPSC చైర్మన్‌ రాజీనామాలో బిగ్‌ ట్విస్ట్‌ ఇచ్చిన గవర్నర్

TSPSC చైర్మన్‌ రాజీనామా (TSPSC chairman Resigns ) విషయంలో షాక్ ఇచ్చారు గవర్నర్ తమిళసై (Governor Tamilisai Soundararajan). TSPSC పేపర్ లీకేజ్ విషయం తెలిసిందే. పేపర్ లీక్ (TSPSC Paper Leak) కావడం తో ఎంతో మంది నిరుద్యోగులు మనోవేదనకు గురయ్యారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్..పేపర్ లీకేజ్ ఘటన ఫై పూర్తి ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో సోమవారం సీఎం రేవంత్ రెడ్డి తో సమావేశమైన టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ జనార్దన్‌ రెడ్డి (TSPSC […]

Published By: HashtagU Telugu Desk
Janardan

Janardan

TSPSC చైర్మన్‌ రాజీనామా (TSPSC chairman Resigns ) విషయంలో షాక్ ఇచ్చారు గవర్నర్ తమిళసై (Governor Tamilisai Soundararajan). TSPSC పేపర్ లీకేజ్ విషయం తెలిసిందే. పేపర్ లీక్ (TSPSC Paper Leak) కావడం తో ఎంతో మంది నిరుద్యోగులు మనోవేదనకు గురయ్యారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్..పేపర్ లీకేజ్ ఘటన ఫై పూర్తి ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో సోమవారం సీఎం రేవంత్ రెడ్డి తో సమావేశమైన టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ జనార్దన్‌ రెడ్డి (TSPSC chairman Janardhan Reddy resigns) తన పదవికి రాజీనామా చేసారు. తన రాజీనామా లేఖను గవర్నర్ కు పంపడం తో వెంటనే ఆమోదం తెలిపినట్లు ప్రచారం జరిగింది. ఈ ప్రచారం చూసి అంత నిజమే అనుకున్నారు. కానీ జనార్దన్‌ రెడ్డి రాజీనామాను ఇంకా గవర్నర్ ఆమోదం తెలపలేదని తాజాగా రాజ్ భవన్ అధికారులు తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TSPSC) చైర్మన్‌ బీ జనార్దన్‌రెడ్డి రాజీనామాను గవర్నర్‌ ఇంకా ఆమోదించలేదని రాజ్‌భవన్‌ (Raj Bhavan) వర్గాలు ప్రకటించాయి. ఆమోదించినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని అధికారులు స్పష్టం చేశారు. గవర్నర్‌ తమిళిసై ప్రస్తుతం పుదుచ్చేరి పర్యటనలో ఉన్నారని చెప్పారు. అయితే పేపర్‌ లీకేజీకి బాధ్యులెవరో తేలేవరకు ఆయన రాజీనామాను ఆమోదించకూడదని గవర్నర్‌ నిర్ణయించినట్లు తెలుస్తున్నది. దీంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జరిపే సమీక్షకు టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ హోదాలో జనార్ధన్‌రెడ్డి హాజరవుతారా లేదా అనేది అంశం ఉత్కంఠగా మారింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు, రాతపరీక్షలు, ప్రశ్నపత్రాల లీకేజీ, తదుపరి నియామక ప్రక్రియ వంటి అంశాలపై సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం మరోసారి సచివాలయంలో సమీక్షించ నిర్వహించనున్నారు.

ఇక జనార్దన్‌రెడ్డి విషయానికి వస్తే.. 2021, మే 20న టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా గత ప్రభుత్వం బిఆర్ఎస్ నియమించింది. మే 21న ఆయన చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం కమిషన్‌లో బండి లింగారెడ్డి, ఆర్‌ సత్యనారాయణ, కోట్ల అరుణకుమారి, సుమిత్రానంద్‌ తనో బా సభ్యులుగా కొనసాగుతున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన జనార్దన్‌ రెడ్డి ఓయూలో విద్యాభ్యాసం పూర్తిచేశారు. 1990లో ఏపీపీఎస్సీ గ్రూప్‌-1కు ఎంపికై డిప్యూటీ కలెక్టర్‌గా ఉద్యోగంలో చేరారు. నల్లగొండ, నెల్లూరు ఆర్డీవోగా, వరంగల్‌, అనంతపురం కలెక్టర్‌గా సేవలందించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అగ్రికల్చర్‌, హార్టికల్చర్‌, సెరీకల్చర్‌, మార్కెటింగ్‌ శాఖలతోపాటు జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ కమిషనర్‌గా పనిచేశారు. విద్యాశాఖ సెక్రటరీగా, వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. ముఖ్యకార్యదర్శిగా పనిచేస్తున్న సమయంలోనే కేసీఆర్ ప్రభుత్వం ఆయనను టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా నియమించింది.

Read Also : Deputy CM Bhatti: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఉప ముఖ్యమంత్రి భట్టి..!

  Last Updated: 12 Dec 2023, 02:11 PM IST