Site icon HashtagU Telugu

Governor Jishnu Dev Varma : రామయ్య ను దర్శించుకున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

Governor Jishnudev Verma

Governor Jishnudev Verma

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ (Governor Jishnu Dev Varma) భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి (Bhadrachalam Sri Sitaramachandra Swamy) వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న గవర్నర్‌కు ఆలయ అర్చకులు సంప్రదాయపరంగా పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, అర్చకులు వేదాశీర్వచనంతో తీర్థ ప్రసాదాలను అందజేశారు.

ఆలయ ఈఓ రమాదేవి, ఇతర అర్చకులు ఆలయ చరిత్ర, విశేషాలను గవర్నర్‌కు వివరించారు. ఆలయ పూజా కార్యక్రమాల తర్వాత, గవర్నర్ ఖమ్మం జిల్లాకు వెళ్లి జిల్లా అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పరిస్థితులు, అభివృద్ధి ప్రణాళికలపై చర్చించినట్లు తెలుస్తోంది. గవర్నర్ జిల్లాకు చెందిన ప్రముఖ కవులు, రచయితలు, కళాకారులు, రాష్ట్ర, జాతీయ అవార్డులు పొందిన వారు వంటి సాంస్కృతిక ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ భేటీలో సాహిత్యం, కళలు, సాంస్కృతిక అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం.

జిష్ణు దేవ్ వర్మ విషయానికి వస్తే ..ఉత్తరాదికి చెందిన రాజకీయ నాయకుడు మరియు భారతీయ జనతా పార్టీ (BJP)కి చెందిన ప్రముఖ వ్యక్తి. త్రిపుర రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్య పాత్ర పోషించారు. జిష్ణు దేవ్ వర్మ త్రిపురలో డిప్యూటీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. అలాగే ఆర్థిక, విద్యుత్, పౌర సరఫరాలు వంటి కీలక శాఖలను నిర్వహించారు. త్రిపురలోని ప్రజలకు సేవ చేయడంలో విశేష కృషి చేశారు. తెలంగాణ గవర్నర్‌గా ఆయన నియమితులైన తర్వాత, రాష్ట్రంలోని ప్రధాన కార్యక్రమాల్లో పాల్గొంటూ, రాజకీయంగా మరియు పరిపాలనపరంగా కీలక పాత్రను పోషిస్తున్నారు.

Read Also : CM Chandrababu : డయేరియాతో 10 మంది మృతి..సీఎంకు కమ్యూనిస్టుల లేఖ