Telangana: తెలంగాణలో ఎన్నికల హడావుడి కనిపిస్తుంది. ఆయా రాజకీయ పార్టీల మధ్య వార్ నడుస్తుంది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత లీడర్ల దూకుడు మరింత పెరిగింది. మరోవైపు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న జాబితా తెరపై కనిపిస్తుంది. పార్టీ సీట్లు దక్కని కొందరు నేతలు నిర్మొహమాటంగా పార్టీ నుంచి బయటకు వచ్చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేలు సైతం పార్టీని వీడారు. బీజేపీలోని ఇదే ధోరణి కనిపిస్తుంది. కాంగ్రెస్ విడుదల చేసిన జాబితాలో తమ పేర్లు కనిపించకపోవడంతో అసంతృప్తి జ్వాలలు ఎగసిపడుతున్నాయి.
కాంగ్రెస్ సీనియర్ నేత గొట్టిముక్కల వెంగళరావు తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తనకు టిక్కెట్ రాకపోవడంతో మనస్తాపం చెంది ఈ నిర్ణయం తీసుకున్నాడు.
శుక్రవారం 45 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ రెండో జాబితాను విడుదల చేసింది. ఇందులో కూకట్‌పల్లి ఎమ్మెల్యే టికెట్‌ను శేరిలింగంపల్లికి చెందిన బండి రమేష్‌కు పార్టీ కేటాయించింది. దీంతో ఆ స్థానం నుంచి టికెట్ ఆశించిన గొట్టిముక్కల కన్నీరుమున్నీరుగా పార్టీకి గుడ్ బై చెప్పారు.
Also Read: Anu Kreethy Vas Latest photoshoot : టైగర్ బ్యూటీలో ఇంత మ్యాటర్ ఉందా..?