Site icon HashtagU Telugu

Free Transport Facility: మందుబాబుల‌కు గుడ్ న్యూస్‌.. నేడు ఉచిత రవాణా స‌దుపాయం

Telangana Govt

Telangana Govt

Free Transport Facility: న్యూఇయ‌ర్ సంద‌ర్భంగా న‌గరంలోని మందుబాబుల‌కు గుడ్ న్యూస్ అందింది. ఈరోజు రాత్రి మ‌ద్యం సేవించిన వారిని క్షేమంగా ఇళ్ల‌కు చేర్చేందుకు ఒక సంస్థ ముందుకొచ్చింది. కొత్త సంవ‌త్స‌ర వేడుక‌లు అంటే పార్టీలు, విందులు, వినోదాల‌తో సంద‌డిగా చేసుకుంటారు. అయితే ఈ సెలెబ్రేష‌న్స్‌లో చాలామంది మోతాదుకు మించి మందు సేవిస్తారు. మ‌ద్యం సేవించి డ్రైవింగ్ చేసి ప్రాణాల మీద‌కు తెచ్చుకుంటారు. కొన్ని కొన్ని సార్లు ప్రాణాలు సైతం పోతుంటాయి. వీట‌న్నింటిని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ఫోర్ వీలర్స్ అసోసియేషన్ ఒక కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. అదేంటంటే ఈరోజు రాత్రి అంద‌రికీ ఉచితంగా ర‌వాణా స‌దుపాయం (Free Transport Facility) ఏర్పాటు చేసిన‌ట్లు ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. అందుకు త‌గిన ఏర్పాట్ల‌ను సైతం చేసింది.

తెలంగాణ ఫోర్ వీలర్స్ అసోసియేషన్ ఈరోజు రాత్రి ఉచిత రవాణా సదుపాయం క‌ల్పించింది. డిసెంబర్ 31 న్యూ ఇయర్ సెలబ్రేషన్ సందర్భంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో ఉచిత రవాణా సదుపాయం అందించనున్నట్లు తెలంగాణ ఫోర్ వీలర్స్ డ్రైవర్ అసోసియేషన్ త‌న ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. మద్యం సేవించి వాహనాలు నడిపితే ప్రమాదాలకు గురవుతారని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఫోర్ వీలర్స్ అసోసియేషన్ పేర్కొంది. ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని ఫోర్ వీలర్ అసోసియేషన్ గిగ్ వర్కర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో 500 కార్లు.. 250 బైక్ టాక్సీలు డ్రైవర్లు అందుబాటులో ఉంటాయ‌ని అసోసియేష‌న్ పేర్కొంది. సేఫ్ జర్నీ కోసం ఉచిత రవాణా సదుపాయం అందుబాటులో ఉండ‌టంతో మందుబాబులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.

Also Read: BRS: బీఆర్ఎస్ ప‌గ్గాలు కొత్త‌వారికి: కేటీఆర్‌

న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా నగ‌రంలో క‌ఠిన నిబంధ‌న‌లు

న్యూ ఇయర్ వేడుకల పేరుతో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామ‌ని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. డ్రగ్స్ పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపారు. రహస్యంగా డ్రగ్స్ వినిగిస్తే ఆయా పబ్బులు, నిర్వాహకులపై చర్యలు ఉంటాయ‌న్నారు. డ్రగ్స్ విక్రయించే ప్రదేశాలపై నిర్వాహకులు నిఘాపెట్టాలని, షీ టీమ్స్ ప్రత్యేక నిఘా ఉంటుందని పేర్కొన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్, ర్యాష్ డ్రైవింగ్ లో పట్టుబడితే చర్యలు త‌ప్ప‌వ‌న్నారు. వేడుకలు నిర్వహిస్తున్న ప్రదేశాలలో తప్పకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అశ్లీల డాన్సులు, అసాంఘిక‌ కార్యకలపాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయ‌న్నారు.