Hyderabad MMTS : హైదరాబాద్ లో మరో 4 ఎంఎంటీఎస్ సర్వీసులు.. యాదాద్రి దాకా పొడిగించే ప్లాన్

Hyderabad MMTS : హైదరాబాద్ సిటీ ప్రజలకు గుడ్ న్యూస్. కొత్తగా మరో 6 ఎంఎంటీఎస్ సర్వీసులు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి.

Published By: HashtagU Telugu Desk
MMTS Trains

MMTS Trains

Hyderabad MMTS : హైదరాబాద్ సిటీ ప్రజలకు గుడ్ న్యూస్. కొత్తగా మరో 4 ఎంఎంటీఎస్ సర్వీసులు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. ఈవిషయాన్ని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. మేడ్చల్ – లింగంపల్లి, మేడ్చల్ – హైదరాబాద్ స్టేషన్ల మధ్య ఈ నూతన ఎంఎంటీఎస్ సర్వీసులు నడువనున్నాయి.  మేడ్చల్-హైదరాబాద్ రూట్ లో ఎంఎంటీఎస్ సర్వీసు నడవడం ఇదే తొలిసారి. నగరానికి ఉత్తరాన ఉన్న ప్రాంతాలకూ ఎంఎంటీఎస్ సేవలను విస్తరించాలనే డిమాండ్ చాలాకాలం నుంచి ఉంది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న దక్షిణమధ్య రైల్వే ఆ రూట్ లోకి కూడా ఎంఎంటీఎస్ ను అందుబాటులోకి తెచ్చింది. ఇకపై మేడ్చల్-లింగంపల్లి మధ్య ఉదయం, సాయంత్రం వేళల్లో అదనంగా నాలుగు సర్వీసులు నడుస్తాయి. మేడ్చల్-హైదరాబాద్‌ మధ్య మరో రెండు సర్వీసులు అందుబాటులోకి వస్తాయి. ఉమ్దానగర్-సికంద్రాబాద్, ఫలక్‌నుమా-సికంద్రాబాద్ స్టేషన్ల మధ్య ఉదయం, సాయంత్రం వేళల్లో అదనపు సర్వీసులు నడుస్తాయి.

We’re now on WhatsApp. Click to Join

హైదరాబాద్ జనాభా పెరుగుతోంది. పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగానే  ప్రస్తుతం నగరంలో ఎంఎంటీఎస్ సర్వీసులను పెంచారు. ఈక్రమంలోనే హైదరాబాద్‌లో రెండో దశ ఎంఎంటీఎస్ విస్తరణను దక్షిణ మధ్య రైల్వే చేపడుతోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే మేడ్చల్ టు ఉందానగర్  ఎంఎంటీఎస్ సేవలను మొదలుపెట్టారు. ఇప్పుడు  కొత్తగా మేడ్చల్-లింగంపల్లి, మేడ్చల్-నాంపల్లి రూట్‌ లోనూ సర్వీసులను ప్రారంభించారు. దీంతో తక్కువ ధరలోనే శివారు ప్రాంతాల నుంచి సిటీలోని వివిధ ప్రాంతాలకు ప్రజలు రాకపోకలు సాగించే అవకాశం ఉంటుంది. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే ఉదయం, సాయంత్రం వేళల్లో ఎక్కువ సర్వీసులను నడపనున్నారు. ఓఆర్ఆర్ చుట్టుపక్కల ప్రాంతాలను కనెక్ట్ చేసేలా, హైదరాబాద్ నుంచి యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ సేవలను విస్తరించేందుకు రైల్వేశాఖ యత్నిస్తోంది. ప్రస్తుతం వీటికి సంబంధించిన పనులు(Hyderabad MMTS)  జరుగుతున్నాయి.

Also read : YSRCP : ఏపీకి మేలు జరగాలంటే జగన్ మళ్లీ సీఎం కావాలి – మాజీ మంత్రి ధ‌ర్మాన కృష్ణదాస్‌

  Last Updated: 07 Oct 2023, 11:24 AM IST