Minister Tummala: ఆయిల్ పామ్ సాగులో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి స్థానంలో ఉంచాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala) అధికారులను ఆదేశించారు. నేడు సచివాలయంలో ఆయిల్ పామ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి.. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా ఆయిల్ పామ్ సాగు చేపట్టలన్నారు. ఈ సంవత్సరంలో 16,729 ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు చేపట్టగా, మార్చిలోగా 19,271 ఎకరాలలో ఆయిల్ పామ్ సాగయ్యేటట్టు చర్యలు తీసుకొని, లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు.
ఆయిల్ పామ్ గెలల ధర కూడా పెరిగినందున రైతులను ఆయిల్ పామ్ సాగు వైపు ప్రోత్సహించేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టలన్నారు. సిద్దిపేట జిల్లా నర్మెట్ట ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ యూనిట్ జూన్ 1 కల్లా పూర్తి చేసి, గెలల ప్రాసెసింగ్ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. బీచ్ పల్లి, కల్లూరు గూడంలలో ప్రాసెసింగ్ ఫ్యాక్టరీల నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ చేపట్టి, పనులు ప్రారంభించాలన్నారు. దీని వలన ఆయిల్ పామ్ సాగు చేపడుతున్న కొత్త జిల్లాలలో రైతులకు ప్రయోజనం చేకూరడంతో పాటు, కొత్త రైతులు ముందకు రావడానికి అవకాశం ఉంటుందని అన్నారు.
Also Read: Lucky Bhaskar: నెట్‌ఫ్లిక్స్‌లో లక్కీ భాస్కర్‌కు అరుదైన ఘనత!
అదేవిధంగా సంస్థకు ప్రభుత్వం కేటాయించిన భూములను సంస్థ పేరు మీదకు మార్చుకొని, చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కార్పొరేట్ సంస్థ మాదిరిగా పనిచేసేందుకు కార్పొరేట్ మోడల్లో వివిధ విభాగాలకు నిపుణత కలిగిన సిబ్బందిని నియమించుకునేట్టుగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
నిరంతరాయంగా విద్యుత్ సరఫరాను రైతులకు, పవర్ లూమ్ పరిశ్రమకు అందించాలని సెస్ అధికారులను మంత్రి ఆదేశించారు. అదనంగా ట్రాన్స్ ఫార్మర్లను అందుబాటులో ఉంచుకొని, సమస్య వచ్చిన వెంటనే మార్చి విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూసుకోవాలన్నారు. ఎలాంటి అవకతవకలు జరగకుండా విద్యుత్ రెగ్యులేటరి కమిషన్ నియమాల ప్రకారం సంస్థను నడిపించాలన్నారు. సంస్థ సిబ్బంది ప్రజాప్రతినిధులను కలుపుకొని వారి సూచనల మేరకు వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలన్నారు.