Site icon HashtagU Telugu

CM KCR: రేపటినుంచి రైతు రుణమాఫీ.. కాంగ్రెస్ ఒత్తిడితోనే సాధ్యం

Congress list

CM KCR: తెలంగాణ రైతాంగానికి ముఖ్యమంత్రి కేసీఆర్ తీపి కబురు అందించారు. ఎప్పటినుంచో నలుగుతున్న రుణమాఫీకి లైన్ క్లియర్. రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని రేపటి నుంచి పునః ప్రారంభించాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. తొలి విడతగా 19 వేల కోట్ల రూపాయల రుణాలను ప్రభుత్వం మాఫీ చేయబోతుంది. నెలన్నర లోపు ఈ ప్రక్రియ పూర్తిగా అమలు అవుతుంది. ఈ మేరకు సంబంధిత అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సెప్టెంబర్‌ రెండో వారం వరకు రుణమాఫీ పూర్తిచేయాలని సూచించారు.

రైతు రుణమాఫీపై తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. కేసీఆర్ రుణమాఫీ ప్రకటన కాంగ్రెస్ విజయంగా చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ఒత్తిడితోనే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. గతంలో దీని గురించి ఉద్యమాలు, నిరసనలు చేపట్టిన విషయాన్ని నొక్కి చెప్పారు. అందులో భాగంగా రుణమాఫి అమలు చేయకుంటే బ్యాంకుల ముందు ధర్నా చేస్తామని కాంగ్రెస్ హెచ్చరించినట్టు రేవంత్ గుర్తు చేశారు. కాగా రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమయంలో విపక్షాలు హామీలపై ప్రశ్నలు లేవనెత్తే అవకాశముంది. ఈ నేపథ్యంలో కెసిఆర్ రుణమాఫీ ప్రకటించడం కొసమెరుపు.

Also Read: Rice Water: బియ్యం కడిగిన నీటితో మీ అందాన్ని రెట్టింపు చేసుకోండిలా?

Exit mobile version